ఎండలు ముదురుతున్నాయ్.. బీ అలర్ట్

Updated on: Apr 14, 2026 | 4:05 PM

తెలంగాణలో రాగల రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-4°C పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వివరించారు. రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం, ఇండియన్ ఓషన్ డైపోల్ పాత్ర గురించి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పటికీ, వేసవికాలంలో ఉపరితల వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల ఇది సాధారణమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో నిజామాబాద్ (40.7°C), మహబూబ్ నగర్ (40.5°C) జిల్లాల్లో నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 38-40°C వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని, కాంక్రీట్ నిర్మాణాలు, జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని శ్రీనివాస్ వివరించారు. పొల్యూషన్, ఏసీల వినియోగం వల్ల కూడా నగరంలో వేడిమి పెరుగుతుందని ఆయన తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్‌!

ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్

షారుఖ్‌ ప్లేస్‌ని రణ్‌వీర్‌ కొట్టేస్తారా?

కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ జోరు

Follow Us