ఎండల్లో పొంగుతున్న బీర్లు.. రికార్డు బ్రేక్‌ చేసిన మందుబాబులు

ఎండల్లో పొంగుతున్న బీర్లు.. రికార్డు బ్రేక్‌ చేసిన మందుబాబులు

Phani CH

|

Updated on: May 17, 2022 | 9:43 AM

తెలంగాణంలో ఎండలు మంట పుట్టిస్తుంటే.. మద్యం ప్రియులు బీర్లు తెగ తాగేస్తున్నారు. ఉక్కపోతలు, వేడిగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు కూల్‌ కూల్‌ బీరులు తాగుతూ చిల్‌ అవుతున్నారు.

తెలంగాణంలో ఎండలు మంట పుట్టిస్తుంటే.. మద్యం ప్రియులు బీర్లు తెగ తాగేస్తున్నారు. ఉక్కపోతలు, వేడిగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు కూల్‌ కూల్‌ బీరులు తాగుతూ చిల్‌ అవుతున్నారు. ఈ దెబ్బకు గతేడాది మే నెలతో పోల్చితే ఈ వేసవి సీజన్‌లో బీర్ల అమ్మకాలు 90 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. బీర్లతో పాటు బ్రాందీ, విస్కీ అమ్మకాలు కూడా పెరిగాయంటోంది అబ్కారీ శాఖ. మార్చి నుంచి ఇప్పటిదాకా 6 వేల 702 కోట్ల రూపాయల బీర్ సేల్స్‌ జరిగాయి. అంటే మద్యం ప్రియులు 10.64 కోట్ల లీటర్ల బీరును తాగేశారన్నమాట. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా బీర్ సేల్స్‌ పడిపోయాయి. అయితే ఈ సారి మాత్రం అమాంతం పెరిగాయి. బీరు అమ్మకాల్లో రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఆ జిల్లాలో 2.38 కోట్ల లీటర్ల బీరు విక్రయం జరిగింది. 1.15కోట్ల లీటర్ల బీరు విక్రయంతో వరంగల్‌ సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. మొత్తానికి ఎండలు మండుతుంటే చల్లని బీర్లు తాగుతూ రిలీఫ్‌గా ఫీలవుతున్నారు మద్యం ప్రియులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sarkaru Vaari Paata: అమెరికా బాక్సాఫీస్‌ మొత్తాన్నీ కొల్లగొడుతున్న సర్కారోడు

హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..

RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్‌ అప్లై !!

Published on: May 17, 2022 09:43 AM