Talibans: ఇదేం రాక్షస పాలనరా బాబు.. బొమ్మల తలలను నరికేస్తున్న తాలిబన్లు.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Taliban Mannequin: అనుకుందే జరుగుతోంది.. తాలిబన్లు ఆఫ్గనిస్తాన్‌ను పాలిస్తే రాక్షస పాలనకు నాంది పలికినట్లేనని అందరూ భావించినట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతీ విషయాన్ని మతానికి ముడిపెడతూ..

Talibans: ఇదేం రాక్షస పాలనరా బాబు.. బొమ్మల తలలను నరికేస్తున్న తాలిబన్లు.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Updated on: Jan 04, 2022 | 3:56 PM

Taliban Mannequin: అనుకుందే జరుగుతోంది.. తాలిబన్లు ఆఫ్గనిస్తాన్‌ను పాలిస్తే రాక్షస పాలనకు నాంది పలికినట్లేనని అందరూ భావించినట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతీ విషయాన్ని మతానికి ముడిపెడతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు తాలిబన్లు. ప్రజలపై బలవంతంగా షరియా చట్టాలను రుద్దుతూ రాక్షస పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే మహిళలు ఉద్యోగాలు చేయవద్దని, మాజీ మిలిటరీ అధికారులను చిత్ర హింసలకు గురి చేస్తున్న తాలిబన్లు తాజాగా దేశంలో ఉన్న విగ్రహాలను, బొమ్మలను తొలగించాలని హుకుం జారీ చేశారు. వీరి పైత్యం ఏ రేంజ్‌లో ఉందంటే చివరికి వస్త్ర దుకాణాల్లో ఉండే బొమ్మలను (mannequins) కూడా నాశనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

షరియా చట్టం ప్రకారం విగ్రహారాధన నేరమని భావిస్తున్న తాలిబన్లు బొమ్మలను కూడా అదే కోవలోకి వస్తాయని ఈ రకమైన ఆదేశాలను జారీ చేశారు. అయితే దుకాణాల్లో బొమ్మలను తొలగించడం వల్ల తమ వ్యాపారం దెబ్బతినడమే కాకుండా, ఎంతో ఖర్చు చేసి కొనుగోలు చేసిన బొమ్మలు వృథా అవుతాయని కొందరు వేడుకోవడంతో తాలిబన్లు ఓ కండిషన్‌ పెట్టారు. బొమ్మల తలలను నరికేసి ప్రదర్శనకు పెట్టుకోవచ్చని తెలిపారు. దీంతో కొంత మంది వ్యాపారులు స్వయంగా బొమ్మల తలలను తొలగిస్తున్నారు.

అయితే కొందరు తాలిబన్లు నేరుగా రంగంలోకి దిగి మరీ బొమ్మల తలలను తొలగిస్తున్నారు. అయితే వీరు బొమ్మల తలలను నరికేస్తున్న తీరు తాలిబన్ల కృరమైన పాలనకు అద్దం పడుతోంది. చిన్న సైజ్‌ రంపం (ఆక్సా బ్లేడ్‌)తో బొమ్మలను నరుకూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. దీనంతటినీ వీడియోలుగా తీసి సంబుపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన ప్లాంట్‌..భారీగా ఉద్యోగాలు

What is Bulli Bai app: అసలు బుల్లీ బయ్‌ యాప్‌ కథేంటి? జాతీయ రాజకీయాల్లో ఎందుకింత రచ్చ.. టార్గెట్ ఎవరూ..

Omicron Treatment: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చికిత్సకు ఆరోగ్య బీమా..ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఆదేశం..!