Sudden death: వణుకు పుట్టిస్తున్న హఠాత్‌ మరణాలు.. స్టేజ్‌పై కుప్పకూలిన శివుడి వేషధారి.. వీడియో.

Updated on: Oct 19, 2022 | 9:55 AM

ఇటీవల రాంలీలా ప్రదర్శన చేస్తూ స్టేజ్‌పైపే కుప్పకూలిన హనుమంతుడి వేషధారి ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ జిల్లాలో వేదికపై శివుడి వేషధారి


జాన్‌పూర్‌ జిల్లాలోని బెలాసిన్‌ గ్రామంలో వేదికపై చబ్బన్‌ పాండే అనే వ్యక్తి రాంలీలా ప్రదర్శన చేస్తున్నాడు. అందులో భాగంగా అతను శివుడి పాత్ర పోషించాడు. ఈ క్రమంలో శివుడికి ఓ భక్తుడు హారతి ఇస్తున్న ఘట్టం జరుగుతుంది. అలా హారతి ఇస్తుండగా శివుడి పాత్రలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి కుప్పకూలిపడిపోయాడు. అతడు గుండెపోటుకు గురైనట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఒక కళాకారుడు ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఇలా కుప్పకూలి మరణించడం ఇదే మొదటిసారి కాదు. దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా యూపీలో రాంలీలా ప్రదర్శన చేస్తూ హనుమంతుడి పాత్రను పోషిస్తూ రామ్‌ స్వరూప్‌ అనే వ్యక్తి ఒక్కసారిగా వేదికపైనుంచి కుప్పకూలి మరణించాడు. అలాగే అయోధ్యలోని ఐహార్ గ్రామంలో రామ్‌లాలా వేదికపై పతిరామ్ అనే మరో వ్యక్తి మరణించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.