Mount Etna: భయంకరంగా లావా విరజిమ్ముతున్నా వెనకడుగు వేయలేదు..

|

Jun 09, 2022 | 8:20 PM

మాంట్‌ ఎట్నా మరోసారి భయపెడుతోంది. ఇటలీలోని ఈ భారీ అగ్ని పర్వతం ఎర్రటి లావాను విరజిమ్ముతోంది. ఈ దృశ్యాలను రెండున్నర కిలో మీటర్ల దూరం నుంచి అత్యంత సాహసంతో తమ కెమెరాలో బంధించారు కొందరు ఉత్సాహవంతులు..

మాంట్‌ ఎట్నా మరోసారి భయపెడుతోంది. ఇటలీలోని ఈ భారీ అగ్ని పర్వతం ఎర్రటి లావాను విరజిమ్ముతోంది. ఈ దృశ్యాలను రెండున్నర కిలో మీటర్ల దూరం నుంచి అత్యంత సాహసంతో తమ కెమెరాలో బంధించారు కొందరు ఉత్సాహవంతులు.. వీరు అగ్ని పర్వతం ఆగ్నేయ దిశలోని బిలం సమీపం వరకూ వెళ్లారు.. యూరోప్‌లోనే అత్యంత చురుకైన, ఎత్తైన అగ్ని పర్వతం మౌంట్‌ ఎట్నాయే. ఇటలీ సిసిలియన్‌ పట్టణం కాటానియా సమీపంలో మౌంట్‌ ఎట్నా ఉంది.. ప్రస్తుతం ఈ అగ్ని పర్వతం నుంచి దట్టమైన పొగతో ఎర్రటి లావా బుసలు కొడుతోంది. ఈ లావా ప్రవాహం సమీపంలో 1292 నుంచి 1472 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత్తలు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు యెల్లో అలర్ట్‌ జారీ చేశారు.. సమీప ప్రాంతాల జనావాసాలను ఖాళీ చేయించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital TOP 9 NEWS: తప్పతాగి రోడ్డు మీద రచ్చ చేసిన చాహల్‌ | గాయపడి ఆస్పత్రికి వచ్చిన కోతి

Big News Big Debate:రిజల్ట్‌ రచ్చ !! ఉత్తీర్ణత శాతం తగ్గడానికి రీజనేంటి ?? ..లైవ్ వీడియో

Ante Sundaraniki Pre Release Event: అంటే! నాని కోసం రంగంలోకి పవన్.. జోష్‌లో న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్..

Follow us on