ఇన్నాళ్లూ చదువు చెప్పి.. మంచి నడవడికలు నేర్పించిన గురువు బదిలీపై వెళ్తుంటే విద్యార్థులు పడ్డ ఆవేదన అందరినీ కదిలించింది…విశాఖపట్నం జిల్లా భీమిలిలోని ఏపీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది ఈ భావోద్వేగ ఘటన. మా ప్రిన్సిపాల్ సర్ రఘునాథ్‌ను బదిలీ చేయొద్దంటూ విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే..రఘునాథ్ సార్,..ఇక్కడి విధుల్లో చేరి..కేవలం 6 నెలలు మాత్రమే అయ్యిందట…ఇంతతక్కువ కాలంలోనే అనేక సంస్కరణలకు బీజం వేసి, మంచి ఫలితాలు తీసుకొచ్చారు. ప్రతి విద్యార్థినితో ప్రత్యేక అనుబంధం పెంచుకున్నారు. విద్యార్థులు, సిబ్బంది మనసులో చెరగని ముద్రవేశారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం రఘునాథ్ సర్‌ని బదిలీ చేసింది. తమ పాఠశాల నుంచి ఆయన వెళ్లిపోతున్నారని తెలుసుకున్న విద్యార్థినులు మనోవేదనకు గురయ్యారు..తమ ప్రిన్సిపాల్ ఎలాగైనా అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. తమ తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో నినాదాలు చేస్తూ.. బదిలీని ఆపాలని డిమాండ్ చేశారు. ఓ టీచర్ కోసం ఇలా ఊరు ఊరే కదిలిరావటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Cyclone Gulab Live Updates Video: గర్జిస్తున్న గులాబ్.. భయం గుపిట్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం… (లైవ్ వీడియో)
Big News Big Debate Live Video: సన్నాసుల కథా చిత్రమ్.. రగులుతున్న మాటల యుద్ధం..(లైవ్ వీడియో)
Jaguar in Ukraine Video: జాగ్వార్ ను పెంచుకుంటున్న కుమార్.. షేక్ చేస్తూ , ఆకట్టుకుంటున్న వీడియో..