Maths Teacher: నన్ను గోట్‌ అని పిలుస్తున్నారు.. కన్నీరు పెట్టుకున్న లెక్కల టీచర్‌..

|

Jul 04, 2022 | 9:01 AM

ప్రస్తుతం ఒక లెక్కల మాస్టర్‌కి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు తనను GOAT అని పిలవడంతో టీచర్ చాలా రోజులు గందరగోళానికి గురయ్యారు. అయితే


ప్రస్తుతం ఒక లెక్కల మాస్టర్‌కి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు తనను GOAT అని పిలవడంతో టీచర్ చాలా రోజులు గందరగోళానికి గురయ్యారు. అయితే అసలు కారణం తెలియగానే స్టూడెంట్స్ అభిమానానికి కళ్లలో నీళ్లు తిరిగాయి. 8వ తరగతికి చెందిన ఒక గణిత ఉపాధ్యాయురాలు తన విద్యార్థులు GOAT అని పిలుస్తారని తెలుసుకున్నారు. తనను విద్యార్థులు ఎగతాళి చేస్తున్నారని భావించిన ఆమె..చాలా బాధ పడ్డారు. ఈ టీచర్ సోషల్ మీడియా వేదికపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. విద్యార్థులు తనను GOAT అని ఎందుకు అంటారో తెలియడం లేదని.. సహాయం కోసం Reddit వినియోగదారులను కోరారు. రెడ్డిట్‌లో ఆ టీచర్ .. విద్యార్థులు నన్ను మేక అని ఎందుకు పిలుస్తారు? అని ఓ పోస్ట్ పెట్టారు.. టీచర్ ప్రశ్న పై జనాలు స్పందిస్తూ.. GOAT పదానికి పూర్తి అర్థం చెప్పారు. దీంతో ఆ టీచర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. GOAT అంటే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అని అర్థం అని వినియోగదారులు చెప్పారు. దీంతో టీచర్ చాలా ఆశ్చర్యపడ్డారు. ఈ పోస్ట్ రెడ్డిట్‌లో 3 రోజుల క్రితం నో స్టుపిడ్ క్వశ్చన్స్ ఫోరమ్‌లో షేర్ చేయబడింది. పిల్లలు తనను మేక అని ఎందుకు పిలిచారో ఇప్పుడు మహిళ ఉపాధ్యాయురాలికి స్పష్టంగా తెలియడంతో.. ఆమె క్యాప్షన్‌ను ఎడిట్ చేసి ఇలా రాశారు.. ‘GOAT పదం అర్థం తెలుసుకున్న తర్వాత నాకు కన్నీళ్లు వచ్చాయి. పిల్లలు నన్ను ఇంతగా మెచ్చుకుంటున్నారని, అభిమానిస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. నా ప్రశ్నకు సమాధానం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. వేలమంది ఈ పోస్టును లైక్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us on