Viral: కిడ్నాపర్ల నుంచి చిన్నారిని వెంటాడి మరీ కాపాడిన వీధి కుక్కలు..
వీధి కుక్కలు చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయనే వార్తల మధ్య వీటికి భిన్నమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బెత్మాలో జరిగింది. కిడ్నాప్‌కు గురైన పదేళ్ల బాలికను వీధి కుక్కలు కాపాడాయి. ఒక చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు బెత్మాలోని కాళీ బిలౌడ్ గ్రామానికి బైక్‌పై వచ్చారు. చిన్నారి ఉంటున్న ఇంటి తలుపు కొట్టారు.
ఒక చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు బెత్మాలోని కాళీ బిలౌడ్ గ్రామానికి బైక్‌పై వచ్చారు. చిన్నారి ఉంటున్న ఇంటి తలుపు కొట్టారు. ఆ సమయంలోతండ్రి దుకాణానికి వెళ్లగా తల్లి ఇంటి పైకి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న చిన్నారి తలుపు తీసింది. ఓ వ్యక్తి చిన్నారిని అమాంతం లేవనెత్తి ఇంటి గోడకు మరో వైపున బైక్‌పై ఉన్న వ్యక్తికి అందించాడు. ఇద్దరూ చిన్నారిని కూర్చోబెట్టి బైక్ స్టార్ట్ చేయబోయారు. ఈ దృశ్యాన్ని చూసిన వీధి కుక్కలు ఆగంతకులను చూసి బిగ్గరగా అరుస్తూ వారి వెంట పడటంతో ఆందోళన చెంది బైక్ నుంచి ఓ వ్యక్తి కింద పడ్డాడు. ఈ క్రమంలో చిన్నారిపై పట్టు కోల్పోయాడు. దాంతో చిన్నారి పరిగెత్తుకుంటూ సమీపంలోని ఆలయంలోకి వెళ్లి దాక్కుంది.
వీధి కుక్కలు కిడ్నాపర్లను అక్కడి నుంచి పారిపోయేలా చేశాయి. ఘటన గురించి బాధిత బాలిక మేనమామ
తమ పదేళ్ల మేనకోడలు ఇంట్లో ఒంటరిగా ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. అయితే దీనిని గమనించిన తమ వీధిలోని కుక్కలు ఆ ఇద్దరు వ్యక్తులపై దాడికి దిగాయనీ దాంతో ఆ ఇద్దరు ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. అప్పుడు ఆ చిన్నారి సమీపంలోని ఆలయంలోకి వెళ్లి దాక్కుందన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.