Viral Video: దొంగతనం చేయడానికి డైటింగ్‌.. కిటికీలోంచి వెళ్లి కటకటాల్లో పడ్డ దొంగ.. వైరల్ అవుతున్న వీడియో..

|

Nov 28, 2021 | 9:12 AM

ఇతను నిజంగా వింత దొంగ అండీ బాబు.. ఇప్పుడు మేము చెప్పబోయే విషయం వింటే మీరు అదే అంటారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ వ్యక్తి ఇంట్లో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ఆశ్చర్యపోయారు.


ఇతను నిజంగా వింత దొంగ అండీ బాబు.. ఇప్పుడు మేము చెప్పబోయే విషయం వింటే మీరు అదే అంటారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ వ్యక్తి ఇంట్లో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అహ్మదాబాద్‌కి చెందిన మోహిత్ మరాడియా అనే వ్యక్తి రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌కి చెందిన మోతీ సింగ్ చౌహాన్ అనే వ్యక్తిని తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నాడు. అయితే మోతీ సింగ్ మూడేళ్ల కిందట… మరాడియా వద్ద పని మానేశాడు. ఎందుకంటే…

మరాడియా ఇంట్లో బాగా డబ్బు, బంగారం ఉండడం చూసిన మోతీసింగ్‌ వాటిని కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఆ ఇంట్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో బాగా తెలిసిన మోతీ సింగ్… ఓ చిన్న కిటీకీని తన ప్లాన్‌కి అనువైన మార్గంగా ఎంచుకున్నాడు. కానీ ఇక్కడే అతనికి ఓ చిక్కొచ్చి పడింది. ఆ కిటికీయేమో బాగా చిన్నది… మోతీ సింగ్ కాస్త లావు మనిషి. దాంతో ఆ కిటీకీలోంచి దూరాలంటే తాను సన్నబడాలని నిర్ణయించుకున్నాడు. అందుకు 3 నెలల పాటు ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తూ 5 కేజీల బరువు తగ్గాడు. తర్వాత తన ప్లాన్‌ అమలు చేసాడు. ఈ సన్నని కిటికీలోంచి ఆ ఇంట్లోకి ప్రవేశించి 13 లక్షల విలువైన సొత్తు కాజేశాడు. ఈ హడావిడిలో ఆ కిటికీకి ఉన్న గ్లాస్ ను పగులగొట్టటానికి ఉపయోగించిన రాడ్‌లాంటి పరికరాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అదే మోతీ సింగ్ ను పోలీసులకు పట్టించింది. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ పరికరం కొన్న షాపు సిబ్బందిని విచారిస్తే మోతీ సింగ్ వివరాలు చెప్పారు. దాంతో అతడిని అరెస్ట్ చేశారు. పాపం కిటికీలోంచి వెళ్లి కటకటాల్లో పడ్డాడు మోతీసింగ్‌.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 28, 2021 09:10 AM