దొంగే.. కానీ వాడికీ ఓ లక్ష్యం ఉందట.. కేవలం అవే అతని టార్గెట్

|

Jun 01, 2024 | 11:14 AM

ఎవరైనా లక్ష్యం సాధించడం కోసం శ్రమిస్తారు.. కానీ వీడు అదో టైపు.. లక్ష్య సాధన కోసం దొంగతనాలు మార్గంగా ఎంచుకున్నాడు. తాళంవేసి ఉన్న ఇళ్లు కనబడితేచాలు ఇల్లు గుల్లే. ఇప్పటివరకు 38 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ ఆ ఘరానా దొంగ ఎట్టకేలకు వరంగల్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. వరంగల్, చుట్టు పక్కల జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు నాగరాజు అనే దొంగను అరెస్ట్ చేశారు.

ఎవరైనా లక్ష్యం సాధించడం కోసం శ్రమిస్తారు.. కానీ వీడు అదో టైపు.. లక్ష్య సాధన కోసం దొంగతనాలు మార్గంగా ఎంచుకున్నాడు. తాళంవేసి ఉన్న ఇళ్లు కనబడితేచాలు ఇల్లు గుల్లే. ఇప్పటివరకు 38 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ ఆ ఘరానా దొంగ ఎట్టకేలకు వరంగల్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. వరంగల్, చుట్టు పక్కల జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు నాగరాజు అనే దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సుమారు 22లక్షల రూపాయల విలువలైన 270 గ్రాముల బంగారు అభరణాలతో పాటు, రెండు ద్విచక్రవాహనాలు, 50వేల రూపాయల నగదు, ఒక మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో దొంగను విచారించిన పోలీసులు అతను చెప్పింది విని షాకయ్యారు. ఇంతకీ సదరు దొంగ దుబాయ్‌ వెళ్లడం తన డ్రీమ్‌ అని, అందుకు డబ్బు లేకపోవడంతో ఇలా చోరీలు చేస్తున్నట్టు చెప్పాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన నాగరాజు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాలలో నివాసం వుంటున్నాడు. ద్విచక్ర వాహన మెకానిక్‌గా పనిచేస్తూనే జల్సాలకు అలవాటు పడ్డాడు. అంతేకాదు ఎలాగైనా దుబాయ్‌ వెళ్లాలనేది అతని కోరిక. అందుకే త్వరగా డబ్బు సంపాదించాలంటే చోరీలొక్కటే మార్గమని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా చోరీలు మొదలు పెట్టాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమాంతం పెరిగిన కూరగాయల ధరలు.. చికెన్‌తో పోటీ

ఇంట్లోకి కుక్క వస్తే..100 డయిల్ చేశాడు.. మరి పోలీసుల రియాక్షనేంటి ??

అప్పుడు టైటాన్.. ఇప్పుడు ట్రిటాన్.. టైటానిక్ కోసం సాహసయాత్ర

పెన్సిల్ లెడ్ పై జీవితచరిత్ర.. యువతి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా

TOP 9 ET News: వెర్రి చేష్టలు కావాలనే బుక్ చేశారు! | 12 దేశాల్లో రికార్డ్‌ క్రియేట్ చేసిన పుష్ప సాంగ్