అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
ప్రేమ హద్దులు మీరింది. చిత్తూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల యువకుడు.. అదే కాలేజీలో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పనిచేసే 38 ఏళ్ల మహిళ మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే.. పెద్దలు తమ ప్రేమను అంగీకరించరనే భయంతో వారిద్దరూ బెంగళూరు పారిపోయారు. విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో ప్రేమ జంటను చిత్తూరు తీసుకొచ్చారు.
మే 24న ఇంటర్న్‌షిప్ కోసం బెంగళూరు వెళుతున్నానని చెప్పి ఇంట్లోంచి వెళ్లిన కుమారుడు ఎన్నాళ్లయినా తిరిగి రాకపోవడంతో యువకుడి.. తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దాంతో కాలేజీలోని అతని స్నేహితులను ఆరా తీయగా, వారికి ల్యాబ్ టెక్నీషియన్‌తో ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో వారు చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. అసలు విషయం బయటపడింది. అయితే.. బెంగళూరులో వీరిని గుర్తించిన పోలీసులు.. చిత్తూరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. పెళ్లయి భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న ఆ మహిళనే పెళ్లాడతానని యువకుడు పట్టుబట్టాడు. మొత్తానికి అతడికి నచ్చజెప్పి.. ఆ జంటను బుధవారం చిత్తూరు తీసుకొచ్చిన పోలీసులు.. ఆ జంటకు కౌన్సిలింగ్ నిర్వహించి.. ఎవరి ఇళ్లకు వారిని పంపించారు. కాగా.. ఈ వింత కథ గురించి కాలేజీలో అందరికీ తెలియటంతో స్టూడెంట్స్, కాలేజీ స్టాఫ్ ఆశ్చర్యానికి లోనయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :