పొలంలో అరికెలు తిని 10 ఏనుగులు మృతి.. ఏం జరిగిందంటే ??

|

Nov 06, 2024 | 5:01 PM

అరికెల పొలంలో మేతకు వెళ్లిన పది ఏనుగులు చనిపోవడంతో అటవీ అధికారులు ఆ పొలాన్ని ధ్వంసం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లాలో ఉన్న బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ లో ఈ ఘటన జరిగింది. చనిపోయిన ఏనుగులకు నిన్న పోస్టుమార్టం నిర్వహించగా మైకోటాక్సిన్స్ కారణంగానే ఏనుగులు మృత్యువాత పడినట్టు నిర్ధారించారు.

మూడు రోజుల్లో పది ఏనుగుల మరణానికి అరికెల పంటకు వాడిన మందులే కారణమని నిర్ధారించిన అటవీశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అరికెల పొలాలు, ఏనుగులు నీళ్లు తాగిన నీళ్ల నమూనాలు తీసుకుని పరీక్షలకు పంపారు. పది ఏనుగుల్లో నాలుగు మంగళవారం మృతి చెందగా, మరో నాలుగు బుధవారం, రెండు గురువారం ప్రాణాలు కోల్పోయాయి. మరో మూడు ఏనుగుల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అవి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయి. అరికెల పంటకు పురుగులు పట్టకుండా వాడిన రసాయనాల్లో మైకోటాక్సిన్స్ ఉండడం వల్ల ఆ పంటను తిన్న ఏనుగులు మృతి చెంది ఉంటాయని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పోస్టుమార్టం సందర్భంగా, ఏనుగుల పొట్టలో పెద్ద మొత్తంలో అరికెలను గుర్తించారు. వీటి మృతిపై దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించారు. మధ్యప్రదేశ్‌లోని ఈ బంధవ్‌గడ్ టైగర్ రిజర్వ్‌లో పులులతో పాటు ఏనుగులు కూడా ఉన్నాయి. 2018 నుంచి వీటి సంతతి పెరుగుతూ వస్తోంది. వీటిలో 50 ఏనుగులు పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్ నుంచి వచ్చి బీటీఆర్‌ను తమ శాశ్వత నివాసంగా మార్చుకున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చనిపోయాడన్న వ్యక్తి.. పోస్ట్ మార్టం సమయంలో బతికే ఉన్నానంటూ కేక !!

Devara OTT: ఓటీటీలోకి ‘దేవర’ ఇట్స్ అఫీషియల్ నౌ

అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య, బాలకృష్ణ

సల్మాన్‌ను చంపేస్తాం.. మా గ్యాంగ్‌ యాక్టివ్‌గానే ఉంది

చందమామపై ఎలా ఉంటుందో.. మన లద్ధాఖ్‌లో అలాగే ఉంటుందా ??