Srimantham cake: శ్రీమంతం కేకు.. ఇలాంటిది మరెక్కడా చూసుండరు..! సోషల్‌ మీడియాలో వైరల్‌గా కేక్.. (వీడియో)

Updated on: Nov 23, 2021 | 9:07 AM

పుట్టిన రోజు... పెళ్లి రోజు... శ్రీమంతం... వేడుక ఏదైనా సరే... అభిరుచులకు అనుగుణంగా వినూత్నంగా కేకులు తయారు చేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం లోని రత్నబేకర్స్ పేరుగాంచింది...


పుట్టిన రోజు… పెళ్లి రోజు… శ్రీమంతం… వేడుక ఏదైనా సరే… అభిరుచులకు అనుగుణంగా వినూత్నంగా కేకులు తయారు చేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం లోని రత్నబేకర్స్ పేరుగాంచింది…కేకుల తయారీలో సృజనాత్మకత జోడించి వేడుకకు తగ్గట్టుగా రకరకాల కేకులు తయారుచేస్తూ… బంధువులకు, స్నేహితులకు తీపిగుర్తులను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా… ఓ కస్టమర్ శ్రీమంతం వేడుకకు కేక్ ఆర్డర్ ఇచ్చాడు. దానికి బేకర్స్‌ సిబ్బంది ఇలా వినూత్న రీతిలో కేక్‌ తయారు చేశారు. పట్టు చీర, జ్యుయలరీ, పూలు, గాజులు, కుంకమ ఆకృతిలో తయారు చేసిన కేకు ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చేరటంతో…శ్రీమంతం కేక్‌ నెటిజన్లను సైతం ఊరిస్తూ,ఆకర్షిస్తోంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 23, 2021 08:59 AM