పాపం గూగుల్‌ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

Updated on: Jan 23, 2026 | 1:15 PM

శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్లాన్ చేసి భారీ చోరీకి పాల్పడ్డ ఐదుగురు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.40.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును దొంగలించారు. చోరీ జరిగిన వారం రోజుల్లోనే కాశీబుగ్గ పోలీసులు ఈ కేసును ఛేదించి, నిందితుల నుంచి సొత్తును రికవరీ చేశారు.

గూగుల్‌ మ్యాప్‌.. ప్రతి ఒక్కరికీ దిక్యూచిగా మారింది గూగుల్‌ మ్యాప్‌. ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ చేయడం… మ్యాప్‌ని ఫాలో అయిపోవడం.. ప్రయాణం ఎంతదూరమైనా ఈజీగా చేరిపోతున్నారు. అయితే ఈ గూగుల్‌ మ్యాప్‌కి ఎలా తెలుస్తుంది సెర్చ్‌ చేసేవాళ్లు ఎవరు? ఎందుకు చేస్తున్నారో.. అలా గూగుల్‌ మ్యాప్‌లో సెర్చ్‌ చేసి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. దొంగలు ఎప్పటికప్పుడు అప్ డేట్ అయిపోతున్నారు. టెక్నాలజీని ఎంచక్కా వాడుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దొంగల ముఠానే శ్రీకాకుళం జిల్లా పోలీసులకు చిక్కారు. ఏ ఆలయంలో చోరికి పాల్పడాలి, ఏ ఆలయంలో దొంగతనం చేస్తే అధిక మొత్తంలో తమకు గిట్టుబాటు అవుతుంది. దొంగతనం అనంతరం ఏ మార్గంలో ఎస్కేప్ అవ్వాలి ఇలాంటివి అన్నీ వీరు ఆన్ లైన్ లోనే చెక్‌ చేసుకుని ప్లాన్‌ వేసుకుంటారు. ఆ తర్వాత రంగంలోకి దిగి రెక్కీ నిర్వహించి పక్కా స్కెచ్ తో గుట్టుగా పని కానిచ్చేస్తారు. అలాంటి ఈ ముఠా కన్ను చిన్న తిరుపతిగా పేరు పొందిన శ్రీకాకుళం జిల్లా పలాస లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై పడింది. ఒరిస్సా రాజకుటుంబానికి చెందిన హరిముకుంద పండా అనే 76ఏళ్ల వృద్ధ భక్తుడు పలాసలో 12ఎకరాల స్థలంలో తిరుపతిని పోలిన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 2025 నవంబర్ 1 న జరిగిన తొక్కిసలాట జరిగి 9మంది భక్తులు చనిపోయారు. ఈ ఆలయంపై కన్నేసిన ముఠా జనవరి 3న ఆలయానికి వెళ్లి రెక్కీ నిర్వహించారు. అంతరం పక్కాప్లాన్‌తో ఈనెల 9వ తేదీన ఆలయంలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు,హుండీలోని రూ.80 వేల నగదు మొత్తంరూ.40.25 లక్షల విలువ చేసే సొత్తు దొంగిలించారు. అయితే దొంగతనం జరిగిన వారం రోజులలోనే కాశీబుగ్గ పోలీసులు ఈ చోరీ కేసును ఛేదించారు. చోరికి సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి చోరికి గురైన చోరికి గురైన మొత్తం సొత్తును రికవరీ చేశారు. నిందితులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన k. శ్రీనివాసరావు, S.బోగేష్,S.సుదర్శన్ రావు,దార రమేష్, p.చక్రధర్‌ను అరెస్ట్ చేశారు. గతేడాది నవంబర్ లోనే జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గతంలో చేసిన చోరీలకు సంబంధించి నిందితులపై సస్పెక్ట్ షీట్ కూడా కొనసాగుతోంది. ఈ సస్పెక్ట్ షీట్ కారణంగానే నిందితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఆలయంలో చోరీ జరిగిన వారం రోజులకే నిందితులను పట్టుకున్నారు.అయితే ఇదంతా శ్రీవేంకటేశ్వరుని మహిమగా భావిస్తున్నారు భక్తులు. అందుకే చోరీ జరిగిన వారం రోజులకే వారి పాపం పండి పోలీసులకు పట్టుబడ్డారని చర్చించుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్‌.. సీన్ కట్ చేస్తే

Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..

Sunita Williams: నాసా వ్యోమగామి సునీత విలియమ్స్‌ కీలక నిర్ణయం

SSC Exams 2026: ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..