అమ్మవారి గుడికి వెళ్లిన భక్తులు..దెబ్బకి వెనక్కి పరుగు..

Updated on: Dec 01, 2025 | 6:33 PM

శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కిలంత్ర గ్రామ దేవత ఆలయంలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న 10 అడుగుల కొండచిలువను చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. సుమారు మూడు గంటల పాటు ఆలయం వద్దే ఉండి, స్థానికులను భయాందోళనకు గురిచేసింది. చివరికి, ప్రజల ప్రయత్నంతో అది సమీపంలోని పొలాల్లోకి వెళ్లిపోయింది.

శుక్రవారం అమ్మవారిని దర్శించుకుందామని భక్తులు గుడికి వెళ్లారు. గర్భగుడి ద్వారం దగ్గర భారీ కొండచిలువ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ కనిపించింది. దాంతో భయంతో భక్తులు ఆలయం వెలుపలికి పరుగెత్తారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కిలంత్ర గ్రామంలో చోటు చేసుకుంది. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గాని,భారీ కొండ చిలువ గ్రామ దేవత ఆలయంలోకి చొరబడింది. ఆ సమయంలో గర్భ గుడి ప్రధాన తలుపులు మూసి ఉండటంతో లోపలకి వెళ్ళలేక అక్కడ ద్వారం వద్దే తచ్చాడుతూ స్థానికుల కంట పడింది. దాదాపు 10 అడుగుల పొడవుతో భారీ సైజులో ఉన్న కొండచిలువ వింత శబ్దాలు చేస్తూ భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. విషయం తెలిసి చుట్టుపక్కలవాళ్లు అక్కడికి భారీగా చేరుకున్నారు. సుమారు మూడు గంటల పాటు ఆలయం వద్దే తిష్ట వేసింది. చివరకు కొందరు వ్యక్తులు దాన్ని బయటకు పంపే ప్రయత్నంలో రాళ్ళు విసిరి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే ఆలయం ప్రాంగణంలో దానిని చoపకూడదని కొందరు పెద్దలు సలహా ఇవ్వడంతో దానిని అక్కడ నుంచి తరిమేసేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించారు. చివరకు జనాల హడావిడికి భయపడిన ఆ కొండచిలువ పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోనసీమలో ఆకట్టుకుంటున్న గోవా బీచ్..

జస్ట్ ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాస్తే తెల్ల జుట్టు మాయం

దేశంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్.. దిమ్మదిరిగే ఆస్తులకు ఓనర్

Andrea Jeremiah: న్యూడ్ పోస్టర్‌ కలకలం! హీరోయిన్ వైపే అందరి చూపు…

Varanasi: హమ్మయ్య! తలనొప్పి నుంచి తప్పించుకున్న జక్కన్న