వీల్‌ఛైర్‌లో ఫుడ్‌ డెలివరీ చేస్తోన్న యువతి !! హ్యాట్సాఫ్‌ అంటోన్న నెటిజన్లు

|

Sep 15, 2022 | 8:50 PM

సంకల్పం, పట్టుదల ఉంటే ఎలాంటి అవరోధాలనైనా అధిగమించవచ్చని చాలామంది దివ్యాంగులు నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడ నెట్టింట్లో దర్శనమిస్తుంటాయి.

సంకల్పం, పట్టుదల ఉంటే ఎలాంటి అవరోధాలనైనా అధిగమించవచ్చని చాలామంది దివ్యాంగులు నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడ నెట్టింట్లో దర్శనమిస్తుంటాయి. అవి చూడడానికి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో మరొకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో దివ్యాంగురాలైన ఓ యువతి వీల్ ఛైర్‌లో కూర్చొని ఫుడ్ డెలివరీ చేస్తోంది. ఈ వీడియో చూస్తుంటే ఆ యువతి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఏజెంట్ అని తెలుస్తోంది. ఆమె ఎక్కడ పనిచేస్తుందో తెలియదు కానీ ఆమె తపనను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీల్‌చైర్‌ను బైక్‌గా మార్చుకుని, వీపుపై స్విగ్గీ బ్యాగ్‌ను తగిలించుకుని కస్టమర్లకు ఫుడ్‌ డెలివరీ చేస్తున్న విధానాన్ని చూసి హ్యాట్సాఫ్ అంటున్నారు. నేటి తరం యువతకు ఆమె ఆదర్శమంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఈ ఇన్‌స్పైరింగ్‌ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్విట్టర్‌లో షేర్ చేసారు. ‘జిందగీ అనేది చాలా కష్టం.. లైఫ్ లో మనం ఏమి కోల్పోయినా అంగీకరించాల్సిందే. ఈ మహిళ స్ఫూర్తికి హ్యాట్సాఫ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా.. వేలల్లో లైక్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డయానా ఉసురు తగిలింది.. ఆమె మహారాణి అయినా ఏం లాభం ??

మెడచుట్టూ కొడవలి.. కాలికి తాళం.. బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు..

బ్రేక్ వేయబోతుండగా బస్సు డ్రైవర్‌కు ఊహించని షాక్ !! కనిపించిన నాగుపాము.. చివరికి ఏం జరిగిందంటే ??

Digital TOP 9 NEWS: కీడు సోకిందంటూ చెట్ల కింద ఉంటున్న గ్రామస్తులు | పది అడుగుల పాము బుసలు కొడితే..

Digital News Round Up: రెమ్యూనిరేషన్‌లో తగ్గేదే లే! | మాజీ సీఎం పరుగులెట్టించిన ఏనుగు ..లైవ్ వీడియో

 

Published on: Sep 15, 2022 08:50 PM