Mango Maggi: భోజన ప్రియులరా నోరూరించే మ్యాంగో మ్యాగీ రెడీ.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Mango Maggi: భోజన ప్రియులరా నోరూరించే మ్యాంగో మ్యాగీ రెడీ.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Anil kumar poka

|

Updated on: May 21, 2022 | 8:53 AM

ఈ రోజుల్లో స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు దేశవ్యాప్తంగా తమ అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త వంటకాలు వెతుక్కోవాలనే తపనతో ఎక్కువగా రెండు రకాల వంటకాలను కలిపి మిక్స్ చేస్తూ భోజన ప్రియులను ఆకర్షిస్తున్నారు. కొత్త కొత్త ప్రయోగాలతో చాలాసార్లు హిట్ కొట్టి సక్సెస్‌ను అందుకుంటారు.


ఈ రోజుల్లో స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు దేశవ్యాప్తంగా తమ అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త వంటకాలు వెతుక్కోవాలనే తపనతో ఎక్కువగా రెండు రకాల వంటకాలను కలిపి మిక్స్ చేస్తూ భోజన ప్రియులను ఆకర్షిస్తున్నారు. కొత్త కొత్త ప్రయోగాలతో చాలాసార్లు హిట్ కొట్టి సక్సెస్‌ను అందుకుంటారు. అదే సమయంలో ఈ ప్రయోగంలో చాలాసార్లు వైఫల్యాలు కూడా చవిచూస్తుంటారు. ఇలా తయారు చేసిన వారి ఆహారం వైర్డ్ ఫుడ్ కేటగిరీలోకి వెళుతుంది.ఇటీవల, వీధి ఆహార వ్యాపారులు అందరికీ ఇష్టమైన మ్యాగీతో చాలా ప్రయోగాలు చేస్తున్నారు. మ్యాగీ ఐస్‌క్రీం మొదలుకొని ఎన్నో ప్రయోగాలు మనం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో వేసవి రాగానే మామిడికాయల సీజన్ వచ్చేసింది. దీని కారణంగా ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు మామిడి – మ్యాగీ కాంబినేషన్‌తో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. అయితే, మ్యాంగో మ్యాగీ చేసిన తీరును చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ది గ్రేట్ ఇండియన్ ఫుడీ అనే ఫుడ్ వ్లాగింగ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో కనిపించింది. ఇందులో ఒక మహిళ మ్యాగీని తయారు చేయడం చూడవచ్చు. ఇందులో ప్రారంభంలో అంతా సరిగ్గానే ఉంది. దీనిలో స్త్రీ ఒక పెద్ద పాన్ మీద నెయ్యి వేసింది. దాని తర్వాత ఆమె మ్యాగీ ప్యాకెట్ చింపి, దాని నుండి మసాలా దినుసులు తీసి, పాన్ మీద పెట్టి ఉడికించింది. అందులో నీరు పోసిన తర్వాత ఆమె మ్యాగీని ఉంచుతుంది. మ్యాగీ కొద్దిగా ఉడికిన వెంటనే అందులో మ్యాంగో కూల్ డ్రింక్ మిక్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ తర్వాత మ్యాగీని వండినప్పుడు, ఆమె మామిడి పానీయంపైన చిన్న మామిడి ముక్కలతో వడ్డించడం కనిపిస్తుంది. ఇది చూసి సోషల్ మీడియా యూజర్లు విస్తుపోతున్నారు. మ్యాంగో మ్యాగీ అంటే ఇలా ఉంటుందా అని. మ్యాగీ మీద మామిడి ముక్కలు వేయడం ఏంటని నెటిజన్లు అశ్చర్చం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొందరికి మాత్రం ఈ వంటకం తెగ నచ్చిందట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

Published on: May 21, 2022 08:53 AM