కాళ్లు చచ్చుబడిన కన్నకొడుకు.. ఇంట్లోకి రానివ్వని తండ్రి
రోజురోజుకీ మానవత్వం నశించిపోతుందా... బంధాలు పలచనవుతున్నాయా.. అంటే అవుననే అనిపిస్తోంది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. నిస్సహాయ స్థితిలో ఉన్న బిడ్డకు నేనున్నాని అండగా నిలవాల్సిన తండ్రి నిర్ధాక్షిణ్యంగా బయటికి గెంటేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరిజిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో జరిగింది.
ఇంటర్ చదువుకున్న తాడిశెట్టటి త్రినాథ్ అనే వ్యక్తి ఉపాధికోసం సింగపూర్ వెళ్లి అక్కడ పని చేస్తూ తండ్రి, తమ్ముడి బ్యాంకు ఖాతాలో ప్రతినెలా 60 వేల రూపాయలు జమచేసేవాడు. ఈ క్రమంలో అతని తల్లి మృతిచెందడంతో స్వగ్రామానికి వచ్చి తల్లి అంత్యక్రియలు అనంతరం మళ్లీ సింగపూర్ వెళ్లిపోయాడు. 2024 జులైలో ఉద్యోగం వదిలి స్వగ్రామానికి వచ్చేశాడు త్రినాధ్. అయితే అతని తండ్రి పెద్దవాడైన త్రినాథ్‌కు కాకుండా తన తమ్ముడికి పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేయడంతో ముందుగా తనకు వివాహం చేయాలని త్రినాథ్ కోరాడు. మరోవైపు త్రినాథ్‌ను సింగపూర్‌లో పనిచేసిన కంపెనీ మళ్లీ ఉద్యోగ అవకాశం కల్పించింది. పెళ్ళి చేసుకొని వెళ్దామనుకున్న అతనికి ఊహించని విధంగా ప్రమాదం జరిగి కాళ్లు చచ్చుబడిపోయాయి. వైద్యం కోసం విశాఖపట్నంలోని ఓ వైద్యశాలలో చేరి చికిత్స చేయించుకుంటున్నాడు. 6 లక్షల వరకూ ఖర్చయింది. చికిత్స పూర్తికావాలంటే మరో రెండు లక్షలు అవుతుందని చెప్పగా ఇంటికి చేరుకొని తండ్రి, తమ్ముడిని డబ్బులు అడిగాడు. దాంతో ఇద్దరూ కలిసి నిస్సహాయుడైన త్రినాథ్‌ను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో నేను సంపాదించినదంతా వారికే ఇచ్చాను.. ఇప్పుడు కనీసం తనను ఇంట్లోకి కూడా రానివ్వడంలేదాని ఆవేదన వ్యక్తం చేసాడు. వీల్ చైర్‌లో ఇంటిముందు దీనంగా కూర్చుని ఉన్న త్రినాథ్‌ను చూసి స్థానికులు చలించిపోయారు. తండ్రి నాగేశ్వరావు తో పోలీసులు చర్చించినా ఫలితం లేకపోవడంతో పోలీసులు త్రినాధుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త కళ్లలో కారం కొట్టి హత్య.. కారణం ఇదే
నల్గొండ కేతమ్మకు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
లోబోకు ఏడాది జైలు శిక్ష..! ఇద్దరి చావుకు కారణం..7 ఏళ్ల తర్వాత తీర్పు
భయానికే భయం పుట్టిస్తున్న హర్రర్ ఫిల్మ్.. అస్సలు మిస్ కావద్దు