భయానికే భయం పుట్టిస్తున్న హర్రర్ ఫిల్మ్.. అస్సలు మిస్ కావద్దు
ఈ సంవత్సరంలో వచ్చిన ఓ హర్రర్ ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. దాదాపు 133 నిమిషాల ఈ మూవీ కథ చాలా టెర్రిఫిక్‌గా ఉంది. చూడటం మొదలుపెట్టాక.. కనురెప్ప వేయనీయనంత క్యూరియాసిటీతో బాటు చచ్చేంత భయం పుట్టించే ఈ మూవీ క్లైమాక్స్ వరకు ఉత్కంఠ కలిగిస్తోంది. ఆ సినిమానే ‘మా’ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ నటించిన సూపర్ నేచురల్ హారర్ చిత్రమే ‘మా’.
థియేటర్లో అందర్నీ ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. అక్కడ కూడా టెర్రిఫిక్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. ఇక ఈ మూవీలో కాజల్.. అంబిక అనే పాత్రను పోషించింది. ఈమూవీలో అంబిక తన భర్త మరణం తర్వాత తన టీనేజ్ కూతురుతో లైఫ్ లీడ్ చేస్తుంటోంది. ఈ క్రమంలోనే కొన్ని కారణాల వల్ల అంబిక తన కుమార్తెతో కలిసి తాను పుట్టి పెరిగిన చిన్న కొండ గ్రామానికి వెళుతుంది. అక్కడున్న తన పూర్వీకుల ఇంటిని అమ్మేయాలనేది అనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత వారికి అసలైన ప్రమాదం ఎదురవుతుంది. చాలా ఏళ్లుగా ఈ ఊరిలో టీనేజ్ అమ్మాయిలు కనిపించకపోవడం..కొందరు శవాలుగా మారి కనిపించటం .. వంటి సంఘటనలు అక్కడ జరుగుతుంటాయి. వీటి వెనక ఒక దుష్టశక్తి ఉందని ప్రజలు నమ్ముతుంటారు. మరోవైపు, అంబిక కుమార్తెకు ఒక వింత వ్యాధి ఉంటుంది. దీంతో ఆ సమస్యకు చికిత్స చేయడంతో ఆ దుష్టశక్తి అంబిక కుమార్తెను లక్ష్యంగా చేసుకుంటుంది. దీంతో, తన బిడ్డను కాపాడుకునేందుకు అంబిక పోరాడుతుంది. ఈ క్రమంలో పెయింటర్ అయిన అంబిక, తన పూర్వీకుల ఇంట్లోని కొన్ని పాత పుస్తకాల ద్వారా తన కుటుంబం గతంలోనూ ఓసారి అదే దుష్టశక్తిని నియంత్రించిందని తెలుసుకొని.. భయంకరమైన పోరాటానికి రెడీ అవుతుంది.అయితే.. ఈ పోరాటంలో ఆమె సక్సెస్ అయ్యిందా లేదా? అనేది అసలు కథ. కాజోల్ నటించిన ఈ చిత్రానికి విశాల్ ఫురియా దర్శకత్వం వహించగా, రోనిత్ రాయ్, గోపాల్ సింగ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. వీలు దొరికితే.. మీరూ ఓ లేక్కేసేయండి!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ దెబ్బకు అరవ హీరో సైలెంట్ అవుతాడా ??
నా కొడుకు కాలు విరిగింది..! అంత బాధలోనూ నా జున్ను ఆ మాట అన్నాడు..
Kannappa: ఎట్టకేలకు OTTలోకి కన్నప్ప మూవీ..! విష్ణు తెలివే వేరబ్బా..!
సినిమా చేస్తే సరిపోతుందా? ప్రమోషన్స్‌కి డుమ్మా కొడితే ఎలా? అనుష్క తీరుపై విమర్శలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

