ఇద్దరు పిల్లల తల్లి.. పెళ్లి కాని పోరడుతో ఎఫైర్‌.. చివరికి కథ కంచికి.. మనం ఇంటికి

Updated on: May 29, 2025 | 1:41 PM

ప్రస్తుతం అంతా సోషల్‌ మీడియా యుగం. పిల్లల నుంచి పెద్దల వరకు సోషల్‌ మీడియాలో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా యువతకు ఇదో వ్యసనంగా మారింది. కొత్త పరిచాయలను కోరుకునే వారికి ఇదో వరంలా మారింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో కొత్త కొత్త ఫ్రెండ్స్‌ యాడ్‌ అవుతుంటారు.

సోషల్‌ మీడియాతో ఎంత లాభం ఉంటుందో రివర్స్‌ కొడితే అంతే కీడు కూడా జరిగిన సంఘటనలు రోజుకో చోట వెలుగు చూస్తూనే ఉంటాయి. స్నేహం పేరుతో పరిచయమై అనంతరం ప్రేమ అంటూ వెంటబడుతుంటారు కొంతమంది. ముఖ పరిచయం లేని వ్యక్తులతో ప్రేమలో పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ప్రేమలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. విశాఖపట్నంలోని ముస్లిం తాటి చెట్ల పాలెంకు చెందిన 40 ఏళ్ల వివాహిత పద్మకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడు సురేష్ ఏడాదిన్నర క్రితం పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ఘాటు ప్రేమగా మారిపోయింది. శ్రీకాళహస్తిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల సురేష్ కు ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా పరిచయమైన పద్మతో విడదీయరాని బంధం ఏర్పడింది. దీంతో పద్మ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి సురేష్ కోసం శ్రీకాళహస్తికి చేరుకుంది. పద్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పద్మ ఆచూకీని తెలుసుకుని అప్పట్లో ఆమెను తిరిగి కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే సురేష్ తోనే జీవితాన్ని కొనసాగించాలని భావించిన పద్మ.. లేఖ రాసి మరీ గతేడాది నవంబరు లోనే మళ్లీ శ్రీకాళహస్తికి చేరుకుని సురేష్‌ను వివాహం చేసుకుని కైలాసగిరిలో కాపురం పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాసాకే చెమటలు పట్టించిన భారతీయ కుర్రాడు.. అట్లుంటది మనతోని

పేరు తీయకుండా.. వంగాకు కౌంటర్‌ ఇచ్చిన దీపిక

ఏంటి ఈమె సమంతనా ?? చూడముచ్చటగా ఉందిగా..