పోలీసులకే రక్షణగా ఉంటున్న పాములు.. ఎక్కడో తెలుసా ??
పోలీసు సిబ్బందిని సాధారణంగా ప్రజలకు రక్షకభటులుగా భావిస్తారు. కానీ, అలాంటి పోలీసులకే కష్టం వచ్చింది.. దాంతో వారిని ఆదుకునేందుకు పాములు రంగంలోకి దిగాయి.
పోలీసు సిబ్బందిని సాధారణంగా ప్రజలకు రక్షకభటులుగా భావిస్తారు. కానీ, అలాంటి పోలీసులకే కష్టం వచ్చింది.. దాంతో వారిని ఆదుకునేందుకు పాములు రంగంలోకి దిగాయి. చట్టాన్ని అమలు చేసేవారికి పాములే రక్షణగా మారాయి. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ, ఈ వింత సంఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. హై-రేంజ్ ఇడుక్కిలోని ఫారెస్ట్-ఫ్రింజ్ పోలీస్ స్టేషన్‌లో ఖాకీలకు రక్షణగా పాములు పనిచేస్తున్నాయి. కేరళ-తమిళనాడు సరిహద్దులో ఉన్న కుంబుమెట్టు పోలీస్ స్టేషన్ చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. దీంతో ఈ పోలీస్ స్టేషన్‌కి కోతులు బెడద ఎక్కువగా ఉంది. వానర బెడదతో పోలీసులు విసిగిపోయారు. ఎంత తరిమికొట్టినా.. మళ్లీ మళ్లీ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో కోతుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఓ విచిత్రమైన ఆలోచన చేశారు. కోతులను భయపట్టేందుకు రబ్బరు పాములను ఏర్పాటు చేశారు. దాంతో వారి ట్రిక్ చాలా బాగా పనిచేస్తోందట. అచ్చం నిజం పాముల్లా ఉండే రబ్బరు పాములను తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ సమీపంలోని చెట్ల కొమ్మలపై, గ్రిల్స్‌పై పెట్టారు. దాంతో అవి నిజమైన పాములనుకుని కోతులు ఆ చుట్టుపక్కలకు రాకుండా పారిపోతున్నాయి. రబ్బరు పాములను చూసిన తర్వాత కోతులు ఈ పోలీస్ స్టేషన్ వైపుకు రావాలంటేనే జంకుతున్నాయని చెప్పారు కుంబుమెట్టు సబ్ఇన్‌స్పెక్టర్ పీకే లాల్‌భాయ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తవ్వకాల్లో బయటపడిన అద్భుతం !! శ్రీరాముడిచే పూజలందుకున్న శివలింగం !!
ఓ కేసులో రహస్య లాకర్లు ఓపెన్ చేసిన ఈడీ అధికారులు.. చూస్తే కళ్లు బైర్లు
మమ్మీ.. నువ్వు మేకప్ తీయొద్దు.. నేను చూడలేను !! నెట్టింట వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో
నీటికోసం వెళ్లి బురదలో కూరుకుపోయిన ఏనుగులు !! హృదయాన్ని కదిలిస్తున్న దృశ్యం..
క్రమం తప్పకుండా స్కూలుకి వెళ్తున్న కొండముచ్చు.. 100 % అటెండెన్స్ !!
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

