Viral: మైదానంలోకి మళ్లీ దూసుకొచ్చిన పాము.. త్రుటిలో తప్పించుకున్న ఫీల్డర్.. వీడియో.
లంక ప్రీమియర్ లీగ్-2023 లో పాములు కలకలం కొనసాగుతోంది. మ్యాచ్ జరుగుతుండగా ఎక్కడ్నుంచి వస్తున్నాయోకానీ, హఠాత్తుగా పాములు మైదానంలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో వాటిని చూసి ఆటగాళ్లు హడలిపోతున్నారు. గాలే టైటాన్స్, దంబుల్లా ఔరా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా గ్రైండ్‌లో ఓ పెద్ద నాగుపాము ఆటగాళ్లను కంగారెత్తించిన విషయం తెలిసిందే. తాజాగా బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పాము ప్రత్యక్షమైంది.
లంక ప్రీమియర్ లీగ్-2023 లో పాములు కలకలం కొనసాగుతోంది. మ్యాచ్ జరుగుతుండగా ఎక్కడ్నుంచి వస్తున్నాయోకానీ, హఠాత్తుగా పాములు మైదానంలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో వాటిని చూసి ఆటగాళ్లు హడలిపోతున్నారు. జులైలో గాలే టైటాన్స్, దంబుల్లా ఔరా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా గ్రైండ్‌లో ఓ పెద్ద నాగుపాము ఆటగాళ్లను కంగారెత్తించిన విషయం తెలిసిందే. తాజాగా బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పాము ప్రత్యక్షమైంది. జాఫ్నా కింగ్స్ ఆడుతున్న 18వ ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్యాండీ జట్టు పేసర్ ఇసురు ఉదాన ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు అటు ఇటు కదులుతుండగా పాము అతడి పక్కనుంచే వెళ్లింది. ఉదాన మరో అడుగు పక్కకు వేసి ఉంటే పాముపై పడేది. ఒక్కసారిగా అటు చూసిన ఉదాన ఉలిక్కిపడి పక్కకకు జరిగాడు. తర్వాత పాము అక్కడి నుంచి బౌండరీలైన్ వైపు వెళ్లిపోయింది. అది చూసి కెమెరామెన్‌లు అక్కడ్నుంచి పరుగందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...