రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూసి.. ఖంగుతిన్న భక్తులు

Updated on: Apr 25, 2025 | 6:55 PM

శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న పాములు తరచూ భక్తులను భయపెడుతున్నాయి. తిరుమల నడకదారి భక్తులకు పలు రకాల విష సర్పాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే అలిపిరి నడక మార్గంలో ఉన్న రాములవారి ఆలయ పోటులో పాము కనిపించింది. దాదాపు 8 అడుగుల పొడవైన జెర్రిపోతు ఆలయ సిబ్బంది కంటపడింది.

పాదాల మండపం సమీపంలోనే ఉన్న ఆలయ పోటులోకి వెళ్ళిన పామును చూసిన భక్తులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు పెట్టారు. వెంటనే టీటీడీ ఫారెస్ట్ విభాగంలో పనిచేస్తున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు చేత్తో పామును పట్టుకుని బయటకు తీసుకెళ్ళాడు. అక్కడున్న ఆలయ సిబ్బంది, భక్తులు పామును చూసి భయంతో వణికిపోగా పామును పట్టుకున్న భాస్కర్ నాయుడు మాత్రం ఆ పాము ఏదో తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అన్నట్టు దాంతో ఆడుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. అంతేకాదు, ఆలయ సిబ్బందిని కూడా భయపడవద్దని, పాము ఏమీ చేయదని మీరు కూడా తాకి చూడవచ్చని చెప్పి ఆలయ సిబ్బందికి చూపాడు. ఆలయం బయట పార్క్ చేసిన బైక్ వద్దకు పామును తీసుకెళ్లి బ్యాగ్ లో వేసుకుని తీసుకెళ్లి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో భక్తులు, ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇప్పుడు వివాహేతర సంబంధం నేరం కాదు.. హైకోర్టు ఏం చెప్తుందంటే ??

Rashmika Mandanna: రష్మిక రియల్ లైఫ్ కష్టాలు తెలుసా ??

Samantha: సమంత ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా ??