కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక్
సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి కారు ఇంజిన్‌లో పాము దూరింది. స్థానికుల ప్రయత్నాలు విఫలమవడంతో, సదాశివపేటకు చెందిన స్నేక్ క్యాచర్ సద్దాం గంటపాటు శ్రమించి పామును సురక్షితంగా రక్షించాడు. ఇంజిన్ వేడికి అస్వస్థతకు గురైన పాముకు ప్రథమ చికిత్స అందించి, అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టాడు. ఈ సంఘటన సద్దాం మానవత్వాన్ని చాటింది.
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. దూరంగా పాము కనిపిస్తేనే హడలిపోతారు కొందరు. అలాంటిది మనం ప్రయాణించే వాహనంలో అతి దగ్గరగా పాము కనిపిస్తే… గుండెజారిపోతుంది కదా. తాజాగా అలాంటి ఘటనే జరిగింది సంగారెడ్డి జిల్లాలో. మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య బ్యాంకు పని మీద బుధేరాకు వచ్చాడు. అక్కడ స్థానిక టీ పాయింట్‌లో టీ తాగుతుండగా జాతీయ రహదారి మీదుగా వచ్చిన పాము కారు ఇంజిన్‌లోకి దూరిపోయింది. ఇది గమనించని చంద్రయ్య టీ తాగడం పూర్తికాగానే బయలుదేరుదామని కారు స్టార్ట్ చేయగా కారులోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని పరిశీలించిన అతనికి కారు ఇంజిన్‌లో పాము కనిపించింది. స్థానికుల సాయంతో పామును బయటకు తీసేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ ఆ పాము బయటకు తీయడం వారివల్ల కాలేదు. దాంతో సదాశిపేటకు చెందిన స్నేక్ క్యాచర్ సద్దాంకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సద్దాం గంటపాటు శ్రమించి పామును బయటకు తీశాడడు. ఓవైపు ఇంజిన్ వేడి, మరోవైపు పామును బయటకు తీసే క్రమంలో ఆ పాము అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో సద్దాం పాముకు ఊపిరాడేలా గాలి ఊది… నీళ్లు తాగించి సపర్యలు చేశాడు. అది కొంచెం కోలుకున్నాక సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్.. కన్ను పడిందా
