Snake head in meal: విమాన భోజనంలో పాము తల.. అధికారులు స్పందించాలి అంటూ వైరల్‌ చేస్తున్నజనం..

|

Aug 04, 2022 | 9:40 AM

భోజనంలో బల్లి బయటపడిన సంఘటన ఇటీవల ఢిల్లీలో కలకలం సృష్టించింది. కానీ, భోజనం చేస్తున్న సమయంలో ప్లేట్‌లో పాము తల కనిపిస్తే..


భోజనంలో బల్లి బయటపడిన సంఘటన ఇటీవల ఢిల్లీలో కలకలం సృష్టించింది. కానీ, భోజనం చేస్తున్న సమయంలో ప్లేట్‌లో పాము తల కనిపిస్తే.. భయంతో వణికిపోతాం. అలాంటి అనుభవమే టర్కీకి చెందిన విమాన సంస్థలో పని చేస్తున్న సిబ్బందికి ఎదురైంది. విమానంలో అందించిన ఆహారం తింటుండగా అందులోని కూరలో పాము తలను చూసి హడలిపోయాడు ఫ్లైట్‌ అటెండంట్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.ఈ సంఘటన జులై 21న జరిగినట్లు ఓ ఇండిపెండెంట్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ ఎక్స్‌ప్రెస్‌ విమానంలో ఓ ఫ్లైట్‌ అటెండంట్‌ , విమానంలో అందించిన ఆహారాన్ని తింటుండగా.. ఆలూ, ఇతర కూరగాయలతో చేసిన కూరలో పాము తల కనిపించినట్లు చెప్పాడు. ట్విట్టర్‌లో షేర్‌ చేసిన వీడియోలో.. ఆహారం వడ్డించిన ప్లేట్‌ మధ్యలో చిన్న పాము తల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనను ఖండించారు ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి. కేటరింగ్‌ కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మరోవైపు.. భోజనంలో పాము తల తమ ప్రాంతం నుంచే వచ్చిందనే వాదనలను తిరస్కరించింది కాంట్రాక్ట్‌ సంస్థ. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఏ ఒక్క వస్తువును వంటలో వేయలేదని పేర్కొంది. 280 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉడికించిన వంటలో.. తాజాగా ఉన్న పాము తల ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించింది? వంట వండిన తర్వాత దానిని వేసి ఉంటారని పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on