పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్‌ చూసి అంతా..

Updated on: Mar 27, 2026 | 5:18 PM

ఎండలు పెరిగిన వేసవి తాపానికి పాములు చల్లదనం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. మార్కాపురం పాఠశాల వంటగదిలో ప్రత్యక్షమైన త్రాచుపాము విద్యార్థులను భయపెట్టింది. స్నేక్ క్యాచర్ మల్లికార్జున చాకచక్యంగా పామును పట్టి అడవిలో విడిచిపెట్టారు. పాములు పర్యావరణానికి మేలు చేస్తాయని, వాటిని చంపవద్దని, సురక్షితంగా పట్టుకోవడానికి నిపుణులను సంప్రదించాలని సూచించారు.

ఎండలు ముదురుతున్నాయి. దీంతో వేసవి తాపం మనుషులనే కాదు..పశుపక్ష్యాదులనూ తాకుతోంది. పుట్టల్లో ఉండాల్సిన పాములు చల్లదనం కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రమంలో ఓ పాఠశాల వంటగదిలో ప్రత్యక్షమైన త్రాచుపాము విద్యార్థులను, ఉపాధ్యాయులను హడలెత్తించింది. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం సిద్ధనపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో వంటగదిలో ఒక్కసారిగా త్రాచుపాము కనిపించడంతో వంట సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించగా, వారు విద్యార్థులెవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో కొద్దిసేపు పాఠశాలలో వాతావరణం ఉత్కంఠగా మారింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జున వెంటనే పాఠశాలకు చేరుకుని, చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పామును పట్టుకున్న అనంతరం స్నేక్‌ క్యాచర్‌ మల్లికార్జున విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. పాములు పర్యావరణానికి మేలు చేసే సరీసృపాలు. వాటిని చూసి భయపడి చంపవద్దని, అవి కనిపిస్తే హాని చేయకుండా దూరంగా ఉండాలని సూచించారు. ఒకవేళ పాము ఎక్కడైనా నిలకడగా ఉంటే వెంటనే తనకు తెలియజేస్తే సురక్షితంగా పట్టి అడవిలో విడిచిపెడతానని వివరించారు. పామును సురక్షితంగా అడవిలో వదిలేయడంతో పాఠశాల వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా మారింది. అయితే, పామును చూసిన కొందరు విద్యార్థులు భయంతోనే భక్తిగా దండం పెట్టుకోవడం అక్కడ అందరినీ ఆకట్టుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్‌ కు రూ. 10 లక్షల జరిమానా

కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు

రెస్టారెంట్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఇక అంతే సంగతులు

RCB: బాస్‌ మారారు.. ఆర్సీబీ పేరుకూడా మారుతుందా ??

గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర

Loading...
Unable to load recommendations.
Follow Us