కోళ్లకు మేత వేద్దామని వెళ్లాడు.. అంతే.. ఒక్క దెబ్బకి..

Updated on: Jun 05, 2025 | 4:48 PM

వర్షాలు మొదలయ్యాయి. ముసురుపట్టి వాతావరణం చల్లబడటం తో ఎండవేడి , అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక పుట్టలు , కలుగుల్లో దాక్కున్న పాములు బయటకు వస్తుంటాయి. పొదల మాటున ఎక్కడపడితే అక్కడ వచ్చి చేరుతుంటాయి. ఇలాంటి సమయంలో నే జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా వ్యవహరించాలి. బుట్టాయిగూడెం కొత్తపేటలో తన ఇంటి ఆవరణలో మంచం నాగేశ్వరరావు కోళ్లను పెంచుతుంటాడు.

వాటికి మేత వేసేందుకు వెళ్లగా అతనికి అక్కడ వింత శబ్ధాలు వినిపించాయి. ఏంటా పరిశీలించిన అతనికి కోళ్ల మేతలో నాగు పాము దర్శనమిచ్చింది. దెబ్బకు భయంతో అక్కడినుంచి ఒక్క ఉదుటన ఇవతలికి వచ్చాడు. మొదట ఆ శబ్దాలు ఎక్కడినుంచి వస్తున్నాయో అతనికి అర్థం కాలేదు. జాగ్రత్తగా ఆలకిస్తే అక్కడ కోళ్ల మేత కోసం ఉంచిన రేకు జారు నుంచి శబ్దాలు బయటకు వస్తున్నట్లు గుర్తించాడు. త్రాచు పాము అందులో చుట్ట చుట్టుకొని పైకి లేచి పడగ విప్పి బుసలు కొడుతోంది. దాన్ని చూసి మొదట ఒకింత భయపడిన నాగేశ్వరరావు జాగ్రత్తగా పాము బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేశాడు. విషయం అర్థమైన పాము అక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోయింది. నాగేశ్వరరావు ఏమరపాటుగా రోజూ వేసే మేత నే కదా అని జారు లో చేయి పెట్టి ఉంటే పాముకాటుకు గురయ్యేవాడు. ఈ ఘటనతో అతనికి పెను ప్రమాదమే తప్పింది. అందుకే ఈ సీజన్ లో ముఖ్యంగా వ్యవసాయపనులకు వెళ్లే వాళ్ళు , గ్రామాల్లో నివసించే వాళ్ళ తో పాటు కాలువల సమీపంపంలో ఇల్లు వున్నవాళ్లు , పొదలు , చెట్లు అధికంగా వున్నచోట నివసించే అందరూ జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఆ కోవిడ్‌ పేషెంట్‌ను చంపేయ్‌’.. డాక్టర్ల ఫోన్‌ సంభాషణ వైరల్‌

బయటపడ్డ మొసలి అస్థిపంజరం…కడుపు ఎక్స్‌రే తీసి చూడగా