Smart Phone washing: మీ స్మార్ట్ ఫోన్‌ను వాష్ బేసిన్‌లో వేసి ఇలా క్లీన్ చేయండి.. వీడియో.
మన చేతుల్ని వదలి వుండని స్మార్ట్ ఫోన్ సంగతేంటి? స్మార్ట్ ఫోన్లు కూడా సూక్ష్మక్రిములకు నిలయాలే! వ్యక్తిగతంగా ఎంత శుభ్రత పాటించినా కూడా తరచూ స్మార్ట్ ఫోన్లను వాడటం వల్ల సూక్ష్మక్రిముల బారిన పడే అవకాశం ఉంది.
కొవిడ్ తరువాత ప్రజలకు పరిశుభ్రత పాటించడంపై అవగాహన పెరిగింది. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడటం లాంటి వంటివి అలవాటయ్యాయి. అయితే.. క్షణం కూడా మన చేతుల్ని వదలి వుండని స్మార్ట్ ఫోన్ సంగతేంటి? స్మార్ట్ ఫోన్లు కూడా సూక్ష్మక్రిములకు నిలయాలే! వ్యక్తిగతంగా ఎంత శుభ్రత పాటించినా కూడా తరచూ స్మార్ట్ ఫోన్లను వాడటం వల్ల సూక్ష్మక్రిముల బారిన పడే అవకాశం ఉంది. కనుక మన చేతులు మాత్రం కడిగితే సరిపోదు.. మీ ఫోన్లను కూడా శుభ్రం చేసుకోవాలి. అయితే.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను శుభ్రపరచడం అంత ఈజీ కాదు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖరీదైన వస్తువును కోల్పోవాల్సి వస్తుంది.ఇలాంటి సమస్యలన్నిటీ పరిష్కారంగా జపాన్ వాళ్లు స్మార్ట్ ఫోన్లు శుభ్రపరిచే విధానాన్ని కనిపెట్టారు. అంతేకాకుండా.. దాన్ని వాష్‌బేసిన్‌లోనే ఏర్పాటు చేశారు. ఏంటి వాష్ బేసిన్‌లోనా.. ఫోన్‌నూ నీళ్లలో వేసి కడగబోతున్నారా అని కంగారు పడకండి. వాస్తవానికి జపాన్ నిపుణులు వాష్ బేసిన అంచున స్మార్ట్ ఫోన్ పట్టేంతటి పొడవైన రంధ్రంలో స్మార్ట్‌ఫోన్ డిస్‌ఇన్ఫెక్టెంట్ యంత్రాన్ని (Smartphone Disinfectant Machine) ఏర్పాటు చేశారు. ఇందులో స్మార్ట్ ఫోన్ పెడితే చాలు.. క్షణాల్లో శుభ్రపడిపోతుంది. దానిపై ఉన్న క్రిములన్నీ నాశనమైపోతాయి. ఇందులో.. స్మార్ట్ ఫోన్‌పై అతినీలలోహిత కిరణాలు ప్రసరింపచేయడంతో సెకెన్ల వ్యవధిలోనే బ్యాక్టీరియా, వైరస్ లాంటి వ్యాధికారకాలన్నీ మటుమాయమైపోతాయి. కేవలం 30 సెకెన్లలోనే ఇది స్మార్ట్‌ఫోన్లను శుభ్రపరుస్తుంది. మనం వాష్‌బేసిన్లో చేతులు కడుక్కోవడం పూర్తయ్యే లోపే ఇది ఫోన్లను పూర్తిస్థాయిలో శుభ్రపరుస్తుంది. 99.9 శాతం క్రిములను నాశనం చేస్తుంది. తొలుత దీన్ని టోక్యోలోని మెక్‌డోనల్డ్స్(McDonalds) రెస్టారెంట్‌లో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
