ఈ బుడ్డోడు మాములోడు కాదు !!ప్లేట్‏లో ఫుడ్ తినేసిన బాతును ఏం చేశాడో చూడండి.. వీడియో

ఈ బుడ్డోడు మాములోడు కాదు !!ప్లేట్‏లో ఫుడ్ తినేసిన బాతును ఏం చేశాడో చూడండి.. వీడియో

Phani CH

|

Updated on: Feb 21, 2022 | 9:29 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. అలాగే చిన్న పిల్లల వీడియోలు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. అలాగే చిన్న పిల్లల వీడియోలు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందులో పిల్లలు చేసే అల్లరి పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మన ఇంట్లో పెంచుకున్న జంతువులతో చిన్న పిల్లలు చేసే అల్లరి గురించి తెలిసిందే. తాజాగా ఓ చిన్నోడి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూస్తే మీరు పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. ఇంతకీ ఆ బుడ్డోడు ఏం చేశాడో చూడండి… వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ బుడ్డోడు.. తన తల్లి ఇచ్చిన ఆహారాన్ని తింటున్నాడు. అప్పుడే వాళ్లింట్లో ఉండే ఓ బాతు వచ్చి ప్లేట్‏లో ఉన్న ఆహారాన్ని చటుకున్న లాక్కుని తినేసింది. అంతే.. ఇంకేముంది ఆ బుడ్డోడికి తెగ కోపం వచ్చింది. ఆ బాతును తీసి నెలకేసి కొట్టాడు.