భర్త గడ్డం నచ్చక.. మరిదితో మహిళ జంప్‌

Updated on: May 06, 2025 | 5:26 PM

ఉత్తర్‌ప్రదేశ్‌ సంచలన విషయాలకు కేరాఫ్‌గా మారింది. ఇటీవల కొంతకాలంగా రకరకాల క్రైమ్‌ వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మీరఠ్‌లో భర్తను చంపి డ్రమ్ములో దాచేయడం.. కాబోయే అల్లుడితో అత్త లేచిపోవడం.. వియ్యంకుడితో వియ్యపురాలు పారిపోవడం వంటి సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అలాంటిది మరో ఆసక్తికరమైన కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది.

భర్త గడ్డం నచ్చని ఓ మహిళ.. క్లీన్‌షేవ్‌తో కళ్ల ముందు తిరుగాడుతున్న మరిదితో కలిసి ఇంటి నుంచి పరారైంది. మీరఠ్‌లోని లిసాడి గేట్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భార్య నిర్ణయంతో కలత చెందిన భర్త పోలీసులను ఆశ్రయించాడు. మౌలానా షకీర్ అనే వ్యక్తికి అర్షి అనే యువతితో ఆరు నెలల కిందట పెళ్లి జరిగింది. 12వ తరగతి వరకు చదువుకొన్న ఈమె కళాశాల చదువు కొనసాగిస్తోంది. తొలిరాత్రే భర్త గడ్డంపై అర్షి అభ్యంతరం తెలిపింది. గడ్డం తీసేది లేదని షకీర్‌ తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఇదే విషయమై ఆమె తనతో చాలాసార్లు గొడవకు దిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన తెలిపారు. షకీర్‌ ప్రతిరోజు ఉదయం పనికి వెళ్లిపోయాక.. ఇంట్లో ఆయన తల్లి, సోదరుడు ఉండేవారు. ఈ క్రమంలో క్లీన్‌షేవ్‌తో కనిపించే షకీర్‌ సోదరుడు ఆమెకు చేరువయ్యాడు. ఓ ఫైన్‌ మార్నింగ్‌ ఇద్దరూ కలిసి ఎటో వెళ్లిపోయారు. ఈ విషయం అర్షి తల్లిదండ్రులకు తెలిసి ఆమెతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు. షకీర్‌ ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయినట్లుగా కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు మీరఠ్‌ పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బస్సు ఆపి డ్రైవర్‌ నమాజ్‌.. ఆ తర్వాత

జైలు ప్రాంగణంలోనే పెళ్లి.. ఖైదీలే అతిథులు.. అదే కదా మ్యాజిక్కు

గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తుడు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ప్రాణం తీసిన చెవినొప్పి..

TOP 9 ET News: 100 కోట్లు కొల్లగొట్టిన సర్కార్‌.. హాలీవుడ్ లోనూ కలెక్షన్ల రచ్చ