గుంటూరులో శివలింగాల మెట్లు !! కోనేరుకు పోటెత్తుతున్న స్థానికులు

|

Jun 15, 2023 | 8:57 AM

మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పెద కోనేరు మరోసారి వార్తల్లో నిలిచింది. గత ఆరు నెలలుగా పెద కోనేరు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విజయనగర రాజుల కాలంలో సుమారు 450 ఏళ్ళ క్రితం ఈ కోనేరు ను నిర్మించారు. మొదట్లో ఈ కోనేరు నుండే నీటిని తీసుకెళ్ళి నరసింహ స్వామి వారికి అభిషేకం చేసేవారు.

మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పెద కోనేరు మరోసారి వార్తల్లో నిలిచింది. గత ఆరు నెలలుగా పెద కోనేరు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విజయనగర రాజుల కాలంలో సుమారు 450 ఏళ్ళ క్రితం ఈ కోనేరు ను నిర్మించారు. మొదట్లో ఈ కోనేరు నుండే నీటిని తీసుకెళ్ళి నరసింహ స్వామి వారికి అభిషేకం చేసేవారు. ఇప్పటి వరకూ కేవలం మూడు సార్లు మాత్రమే మరమ్మతు పనులు జరిగాయి. బ్రిటీష్ పరిపాలన కాలంలో ఒకసారి కోనేరులో నీటిని మొత్తాన్ని తోడేశారు. అప్పుడు తుపాకులు కూడా బయట పడ్డాయి. అయితే గత కొన్నేళ్లుగా కోనేరు మూతపడింది. కోనేరు చుట్టూ ఇళ్ళ నిర్మాణం పెరిగిపోవటంతో మురికి కూపంలా తయారయింది. దీంతో కోనేరును పూర్తిగా మూసివేశారు. ఈ క్రమంలో పెద కోనేరును పునర్నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంకల్పించారు. గత ఏడాది డిసెంబర్ లో పనులు మొదలు పెట్టారు. మొత్తం నీటిని తోడటానికే నాలుగు నెలల సమయం పట్టింది. కోనేరు పడమర గోడపై ఆంజినేయ స్వామి దేవాలయం మొదట బయటపడింది. ఆ తర్వాత ఈశాన్య మూలలో రెండు శివలింగాలు బయటపడ్డాయి. వీటిని తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జైలు ఖైదీలకు చేదువార్త.. నో నాన్ వెజ్..

ఫేస్‌బుక్‌ లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం !! కారణం అదేనా ??

 

Follow us on