ముచ్చటగా 8 పెళ్లిళ్లు.. తొమ్మిదో పెళ్లికి సిద్ధమైన మహిళకు ఊహించని షాక్‌

Updated on: Aug 06, 2025 | 6:24 PM

ఇప్పటికే 8 పెళ్లిళ్లు చేసుకొని తొమ్మిదో పెళ్లికి సిద్ధమైన నిత్యపెళ్లికూతురి బాగోతం మహారాష్ట్రలో వెలుగుచూసింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టి పెళ్లికాని ప్రసాదులకు దగ్గరవుతుంది. తనకు ఆల్రెడీ పెళ్లయి భర్తతో విడాకులయ్యాయని, తనకు ఓ బిడ్డ కూడా ఉందని, కష్టపడి బిడ్డను పోషించుకుంటున్నానంటూ ఎమోషనల్‌గా వారికి దగ్గరవుతుంది.

చివరికి వారు తనను పెళ్లిచేసుకునేలా కన్విన్స్‌ చేస్తుంది. ఆ తర్వాత వివాహం చేసుకొని తన అసలు రూపాన్ని బయటపెడుతుంది. వారినుంచి డబ్బు డిమాండ్ చేసి బెదిరించి వసూలు చేస్తుంది. ఈ క్రమంలో తొమ్మిదో ప్రయత్నంలో ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌నకు చెందిన సమీరా ఫాతిమా ఉపాధ్యాయిని. బాగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. వయస్సు మీదపడుతున్నా పెళ్లికాని ధనవంతులను లక్ష్యంగా చేసుకుని, సామాజిక మాధ్యమాల్లో వారికి దగ్గరై.. విధిలేని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, ఓ బిడ్డతో కలిసి ఒంటరిగా బ్రతుకుతున్నానని చెబుతుంది. చివరికి వారిని ముగ్గులోకి దించి పెళ్లి చేసుకుంటుంది. కొన్ని రోజులు గడిచాక.. ఆమె పథకం అమలు చేస్తుంది. వారి నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తుంది. వారు ఇవ్వనంటే ఆమె గ్యాంగ్‌ను రంగంలోకి దించుతుంది. వారు ఫాతిమా భర్తలను బెదిరించి బలవంతంగా డబ్బు వసూలు చేస్తారు. ఇలా గత 15 ఏళ్లల్లో 8 పెళ్లిళ్లు చేసుకొని వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసింది. మోసం ఎప్పటికైనా బయటపడక మానదు అన్నట్టుగా.. సమీర భర్తలలో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఈ నిత్యపెళ్లికూతురి బాగోతం బయటపడింది. సమీర తన నుంచి రూ.50 లక్షలు బలవంతంగా వసూలు చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు బయటపడ్డాయి. ఆమె బాధితుల్లో రిజర్వ్‌బ్యాంక్‌ సీనియర్‌ అధికారులు కూడా ఉండటం గమనార్హం. అయితే, 8 మంది భర్తల నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితురాలు.. మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో జులై 29న నాగ్‌పుర్‌లోని ఓ టీ దుకాణం వద్ద ఆ వ్యక్తిని కలిసేందుకు వచ్చిన ఆమెను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

30 ఏళ్లనాటి పిండం.. ఇప్పుడు శిశువుగా జననం

బిగ్‌ అలర్ట్‌.. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే మూడిందే.. తరువాత ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు..

గూగుల్ తీసిన నగ్న ఫోటో.. కోర్టుకెళ్తే రూ.10 లక్షల నష్ట పరిహారం

నడి రోడ్డుపై బుస్సుమన్న నాగ పాము.. చూసిన జనాలు పరుగో పరుగు

ఏం సినిమా రా బాబూ.. రూ. 17,400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు ప్రపంచ బాక్సాఫీస్ షేక్