వినాయకుడికి నైవేద్యంగా బంగారు ఉండ్రాళ్లు! కేజీ ఎంతో తెలుసా?

వినాయక చవితి వేడుకల సందర్భంగా ఓ మిఠాయి దుకాణం బంగారు ఉండ్రాళ్లను అమ్మకానికి పెట్టింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పూజలందుకున్న గణనాథులను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. బ్యాండ్ బాజాలు, డీజేలతో డ్యాన్సులు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి.. గణేషుడికి వీడ్కోలు పలుకుతున్నారు.

Updated on: Sep 04, 2025 | 5:33 PM

ఈ నిమజ్జనాల సందర్భంగా చాలా ప్రాంతాల్లో కొన్ని భావోద్వేగమైన సంఘటనలు జరుగుతున్నాయి. చిన్నారులు గణపయ్య విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఇష్టపడట్లేదు. తమకు ఇష్టమైన గణనాథుడిని నీటిలో వేయొద్దంటూ అడ్డుకుంటున్నారు. విగ్రహాన్ని కౌగిలించుకొని బోరున ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా.. చిన్నారులు మాత్రం గణపయ్యను వదిలేందుకు ఇష్టపడట్లేరు. ఇలాంటి ఘటన దేశవ్యాప్తంగా చాలా జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ.. ఆ బుజ్జి గణపయ్యపై చిన్నారులు చూపుతున్న ప్రేమను చూసి వారు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే వినాయక చవితి వేడుకల సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ మిఠాయి దుకాణం యజమాని అమ్మకానికి పెట్టిన బంగారు ఉండ్రాళ్లు ఇవి. తయారీలో పసిడి వాడిన ఈ ఉండ్రాళ్లను కిలో రూ. 20 వేల ధరకు అమ్ముతున్నారు. వైరల్‌గా మారిన ఈ ఫొటోపై నెటిజన్లు స్పందించి కామెంట్లు చేస్తున్నారు. ‘వీటిని తినాలా?.. లాకర్‌లో దాచుకోవాలా?’ అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండియా దెబ్బకు అమెరికా రివర్స్ గేమ్..

హ్యాట్సాఫ్‌.. కాకి కోసం ప్రాణాలకు తెగించి

కాళ్లు చచ్చుబడిన కన్నకొడుకు.. ఇంట్లోకి రానివ్వని తండ్రి

భర్త కళ్లలో కారం కొట్టి హత్య.. కారణం ఇదే

నల్గొండ కేతమ్మకు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్