Viral: గుండు తాకింది.. గుండె కరిగింది.. పోలీసుల మానవత్వం.. మావోయిస్టుకు పోలీసుల ప్రాణదానం
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా, హుస్సిపీ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. తుపాకుల మోతతో అడవి అంతా దద్దరిల్లింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే సహచర మావోయిస్టులు అతన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. గాయాల బాధతో మూలుగుతున్న మావోయిస్టు భద్రతా సిబ్బందికి కనిపించగా వెంటనే అతడిని భుజాలపైకి ఎత్తుకుని, ఐదు కిలోమీటర్లు అడవిలో..
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా, హుస్సిపీ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. తుపాకుల మోతతో అడవి అంతా దద్దరిల్లింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే సహచర మావోయిస్టులు అతన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. గాయాల బాధతో మూలుగుతున్న మావోయిస్టు భద్రతా సిబ్బందికి కనిపించగా వెంటనే అతడిని భుజాలపైకి ఎత్తుకుని, ఐదు కిలోమీటర్లు అడవిలో నడిచి ప్రాణదానం చేశారు.అతని పట్ల పోలీసులు చూపిన మానవత, ఔదార్యంపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. గత శుక్రవారం పోలీసులు యాంటీ మావోయిస్టు ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గాయపడిన మావోయిస్టును భద్రతా సిబ్బంది భుజానికెత్తుకుని ఐదు కిలోమీటర్లు నడిచి హాత్తిబురు క్యాంపునకు చేర్చారు. దారిలో మావోయిస్టులు పాతిపెట్టిన ఐఈడీలు ఉంటాయని తెలిసి కూడా ఆ పోలీసులు తమ ప్రాణాలకు తెగించి ప్రాణదాతలుగా మారారు. క్యాంపు వైద్యులు క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం శనివారం హెలికాప్టర్‌లో రాంచీలోని హాస్పిటల్‌కు తరలించినట్టు పోలీసు శాఖ తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..