సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా

Updated on: Oct 14, 2025 | 7:15 PM

అతను ఆ కంపెనీకి సెక్యూరిటీ గార్డు. ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులను చూసి తాను కూడా వారిలా మంచి ఉద్యోగాన్ని సాధించాలనుకున్నాడు. కోడింగ్ నేర్చుకుంటే జీవితం బాగుంటుందని భావించి.. తన పని వేళలు ముగిశాకా కోడింగ్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తూ.. పుస్తకాలు చదువుతూనే సొంతంగా కోడింగ్ నేర్చుకున్నాడు.

రాత్రుళ్లు తక్కువగా నిద్రపోతూ.. ఎక్కువ సమయాన్ని కోడింగ్ నైపుణ్యాలను పెంచుకోవడానికి వాడుకున్నాడు. తనకు కోడింగ్ మీద ఎంత పట్టు వచ్చిందో తెలుసుకోవడానికి సొంతంగా ఒక యాప్‌ రూపొందించాడు. అంతటితో ఆగకుండా తను రూపొందించిన అప్లికేషన్‌, తాను సంపాదించుకున్న నైపుణ్యాలను అబ్దుల్ అలీం జోహో కంపెనీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కంపెనీ యాజమాన్యం ఆయన ప్రతిభను, అంకితభావాన్ని గుర్తించింది. ఇక్కడ అలీంకు అధికారిక ఇంజనీరింగ్ డిగ్రీ ఉందా? లేదా? అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా.. ఆయనలో ఉన్న నిజమైన ప్రతిభకు విలువ ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా ఆయనకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పదోన్నతి కల్పించింది. తన కలల ఉద్యోగాన్ని.. తాను సెక్యూరిటీ గార్డుగా పని చేసిన చోటే దక్కించుకోవడంతో.. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. సర్టిఫికేట్లు, చదువు వంటివి ఏమీ చూడకుండా.. వ్యక్తి టాలెంట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుని సెక్యూరిటీ గార్డుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని కట్టబెట్టడం చాలా సంతోషంగా ఉందంటూ అనేక మంది ప్రశంలు కురిపిస్తున్నారు. జోహోకు సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. డిగ్రీల కంటే నిజమైన నైపుణ్యానికే విలువ ఇవ్వాలనే సూత్రాన్ని ఐటీ సంస్థ జోహో మరోసారి నిరూపించింది. అరట్టై మెసేజింగ్‌ యాప్‌ ద్వారా ఇటీవల సామాన్యులకు చేరువైన జోహో.. ఇప్పుడు పాయింట్ ఆఫ్‌ సేల్‌ డివైజ్‌ల ద్వారా హార్డ్‌వేర్‌ రంగంలోనూ ఎంట్రీ ఇచ్చింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ వేదికగా మంగళవారం ఈ డివైజులను ఆవిష్కరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీ ఫిట్‌నెస్ సూపర్‌ బ్రో… సైకిల్‌పై ఈఫిల్‌ టవర్‌ ఎక్కాడు

సెల్ఫీ తీయబోతూ.. 18 వేల అడుగుల్లో పట్టు తప్పి

హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్న లేటెస్ట్ టెక్నాలజీ..

కాసులు కురిపిస్తున్న కామెడీ జానర్‌

రూటు మార్చిన రౌడీ హీరో.. ఇక విజయ్ గురి దానిపైనే..