Viral: సముద్రం అడుగున రామచంద్రుడు.! విశాఖ బీచ్‌ వద్ద అబ్బురపరిచిన దృశ్యం.

|

Jan 24, 2024 | 4:48 PM

జనవరి 22 సోమవారం యావత్‌ భారతదేశం మనసు, చూపు అయోధ్యవైపే ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఊరూవాడా రామనామకీర్తనలతో మార్మోగింది. పలువురు తమదైనశైలిలో రామునిపై భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన స్కూబా డైవర్లు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సముద్ర గర్భంలో రాముని చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకున్నారు. సోమవారం రిషికొండ బీచ్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

జనవరి 22 సోమవారం యావత్‌ భారతదేశం మనసు, చూపు అయోధ్యవైపే ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఊరూవాడా రామనామకీర్తనలతో మార్మోగింది. పలువురు తమదైనశైలిలో రామునిపై భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన స్కూబా డైవర్లు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సముద్ర గర్భంలో రాముని చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకున్నారు. సోమవారం రిషికొండ బీచ్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రంలో 22 అడుగుల లోతున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాముడిపై హిందువులకు ఉండే బలమైన విశ్వాసానికి, సంప్రదాయానికి ఈ కార్యక్రమం చిహ్నమని స్కూబా డైవర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు స్కూబా డైవర్లు పాలుపంచుకున్నట్టు లివిన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ ఫ్రాంటియర్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నాయుడు తెలిపారు. ఫోమ్ బోర్డుపై ఏర్పాటు చేసిన రాముడి చిత్రంపటంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, చిత్రపటంపై పూల రేకులు, ఆక్సిజన్ బబుల్స్ కురిపించామని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us on