Bullet Bike: మీకు బుల్లెట్ బండి ఉందా.. అయితే జాగ్రత్త.! సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు.
కినాడ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆరుబయట పార్క్ చేసిన వాహనాలను తెల్లారేసరికి మాయం చేసేస్తున్నారు. అవును, తాజాగా సామర్లకోటలోని మటన్ సెంటర్ గంపలవారి వీధిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను ఎత్తుకెళ్లిపోయారు. అందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఓ ఇద్దరు యువకులు ఇంటి బయట పార్క్ చేసిన బైక్‌ను అపహరించుకుపోయారు. సామర్లకోటలో గున్నం సాయికృష్ణ అనే వ్యక్తి కి చెందిన ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎంతో చాకచక్యంగా బైక్‌ల తాళం విరగొట్టి బుల్లెట్‌పైన తుర్రుమని వెళ్లిపోయారు దొంగలు. ఉదయం ఇంటిముందు పార్క్ చేసిన బైక్ కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. సీసీ కెమెరా ఆధారంగా దొంగల ఆచూకీ కనిపెట్టే పనిలో పడ్డారు పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...