Sarabjit Singh: భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

|

Apr 16, 2024 | 8:52 PM

భారత్‌కు చెందిన సరబ్‌జిత్‌ సింగ్‌ను పాకిస్థాన్‌ జైల్లో చంపిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న అమీర్‌ సర్ఫరాజ్‌ తాంబాను గుర్తుతెలియని దుండగులు ఆదివారం హత్య చేశారు. లాహోర్‌లో ఈ ఘటన జరిగింది. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌కు తాంబా అత్యంత సన్నిహితుడు.సరబ్‌జిత్‌ సింగ్‌ పంజాబ్‌లోని భికివిండ్‌కు చెందిన రైతు.

భారత్‌కు చెందిన సరబ్‌జిత్‌ సింగ్‌ను పాకిస్థాన్‌ జైల్లో చంపిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న అమీర్‌ సర్ఫరాజ్‌ తాంబాను గుర్తుతెలియని దుండగులు ఆదివారం హత్య చేశారు. లాహోర్‌లో ఈ ఘటన జరిగింది. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌కు తాంబా అత్యంత సన్నిహితుడు. సరబ్‌జిత్‌ సింగ్‌ పంజాబ్‌లోని భికివిండ్‌కు చెందిన రైతు. భారత్‌-పాక్‌ సరిహద్దులో ఈ ప్రాంతం ఉంది. పాకిస్థాన్‌లోకి అక్రమంగా ప్రవేశించాడనే కారణంగా 1990లో అరెస్టయ్యాడు. పంజాబ్‌ ప్రావిన్సులో అనేక బాంబు పేలుళ్లలో పాల్గొన్నట్లు అభియోగాలు మోపిన పాక్‌.. అతడికి మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో లాహోర్‌లో కోట్‌ లఖపత్‌ జైల్లో ఉన్న అతడిపై తోటి ఖైదీలు దాడులకు తెగబడ్డారు. ఇటుకలు, ఇనుప కడ్డీలతో తీవ్రంగా దాడిచేశారు. దాంతో కోమాలోకి వెళ్లిపోయిన సరబ్‌జిత్‌.. మే 2, 2013న ప్రాణాలు కోల్పోయాడు. అయితే, సరబ్‌జిత్‌పై దాడి చేసిన నిందితుల్లో సర్ఫరాజ్‌ ఒకడు. సరబ్‌జిత్‌ను నిర్దోషిగా ప్రకటించాలంటూ అతడి కుటుంబం సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది. పొరపాటున తన సోదరుడు సరిహద్దు దాటారని వేడుకున్న అతడి సోదరి దల్బీర్‌కౌర్‌.. జైల్లో ఉన్న సోదురుడిని చూసేందుకు పాకిస్థాన్‌కూ వెళ్లివచ్చారు. చివరకు ఆమె కూడా గతేడాది కన్నుమూశారు. సరబ్‌జిత్‌ పేరుతో ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో 2016లో ఓ బయోపిక్‌ కూడా వచ్చింది. ఇందులో రణదీప్‌ హుడా, ఐశ్వర్యరాయ్‌లు నటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us on