రాష్ట్రపతి హెలికాప్టర్‌ను నెట్టిన సిబ్బంది

Updated on: Oct 24, 2025 | 4:27 PM

శబరిమల అయ్యప్ప దర్శనం కోసం కేరళ వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతుండగా, హెలిప్యాడ్ ఉన్నట్టుండి కుంగిపోయింది. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. తిరువనంతపురం నుంచి బుధవారం ఉదయం పథనంథిట్టకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు.

హెలికాఫ్టర్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియంలో దిగుతుండగా కొత్తగా నిర్మించిన కాంక్రీట్‌ హెలిప్యాడ్‌ ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్‌ చక్రం అందులో ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన అక్కడ భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్‌ నుంచి దించారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పంబకు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప స్పామి దర్శనానికి వెళ్లారు. హెలికాప్టర్‌ చక్రాన్ని బయటకు తీసేందుకు పలువురు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. దాన్ని తోస్తున్న చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి రాష్ట్రపతి హెలికాప్టర్‌ పంబ సమీపంలోని నీలక్కల్‌ వద్ద దిగాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో ల్యాండింగ్‌ ప్రదేశాన్ని స్టేడియంకు మార్చారు. అప్పటికప్పుడు హడావుడిగా కాంక్రీట్‌తో హెలిప్యాడ్‌ నిర్మించినా అది పూర్తిగా ఎండిపోలేదు. అందువల్లే హెలికాప్టర్‌ చక్రం దిగిందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ప్రభాస్ రూ.3500 కోట్లు..ఫిల్మ్ ఫెటర్నిటీలో ఒకే ఒక్కడు

Renu Desai: మీకు దండం పెడతాను.. ఇలాంటి వార్తలు వద్దు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..