కారు డ్రైవర్‌ దాష్టీకం.. సైడ్‌ ఇవ్వలేదని

Updated on: Nov 22, 2025 | 11:57 AM

రాజన్న సిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్‌పై కారు డ్రైవర్ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. బస్సుకు సైడ్ ఇవ్వలేదన్న కోపంతో జరిగిన ఈ దాడిపై రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులను సహించబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో ఉన్న సిబ్బంది భద్రతకు రక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల ఆర్టీసీ సిబ్బందిపై కొందరు దాడులకు పాల్పడుతున్నారు. బస్సు ఆపలేదనో, ఇతర వాహనాలకు సైడ్‌ ఇవ్వలేదనో డ్రైవర్‌, కండక్టర్లపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ కారు డ్రైవర్‌ దాడికి పాల్పడ్డాడు. ఘటనపై రవాణాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిరిసిల్ల డిపో నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బయలుదేరింది. వల్లంపట్ల మార్గంలో వెళ్తుండగా కొంతదూరం వెళ్లేసరికి ఇరుకైన రోడ్డు వచ్చింది. దాంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఎదురెదురుగా వచ్చే వాహనాలకు సైడ్‌ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఓ వైపు వాహనాలన్నీ వెళ్లేవరకూ మరోవైపు వచ్చే వాహనాలు ఎదురుచూడక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుకు ఎదురుగా ఓ కారు వచ్చింది. ఆర్టీసీ బస్సు కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కోపంతో కారు డ్రైవర్‌ శ్రీకాంత్ కారు దిగొచ్చి స్టీరింగ్‌ సీటులో కూర్చున్న ఆర్టీసీ డ్రైవర్‌ బాలరాజుపై దాడి చేశాడు. ప్రయాణికులు ఆపాలని చూసినా శ్రీకాంత్‌ పట్టించుకోలేదు. కాలుతో తన్నుతూ దుర్భాషలాడుతూ ఆర్టీసీ డ్రైవర్‌ను కొట్టాడు. రోడ్డు ఇరుకుగా ఉందని బస్సు డ్రైవర్‌ చెప్పినా శ్రీకాంత్‌ వినకుండా ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దాడితో భయాందోళనకు గురైన ఆర్టీసీ డ్రైవర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రయాణికుల వాంగ్మూలాలు తీసుకున్నారు. ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే సహించబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశించారు. ఈ ఘటనతో ఆర్టీసీ సిబ్బందిలో ఆందోళన నెలకొంది. రోడ్లపై తమ భద్రత కోసం రక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యూలో నిలబడి రూ.5ల భోజనం చేసిన కలెక్టర్‌

నీ ధైర్యానికో దండంరా సామీ.. దాన్ని పట్టుకుని ఆలా ఎలా వెళ్ళావు రా..

పదో తరగతి అర్హతతో రైల్వేలో 4,116 ఉద్యోగాలు

ఇంటింటికి బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరల పంపిణీ.. ఎవరు అర్హులంటే

ములుగు జిల్లాలో గుప్తనిధులు.. ఒక్కో నాణెం 23 తులాలు ??