Gangavva: గంగవ్వ చొరవతో ఆ గ్రామానికి బస్సు సర్వీసు.. శభాష్‌ అంటున్న గ్రామస్తులు..కాకపోతే..

Edited By:

Updated on: May 04, 2022 | 5:20 PM

గంగవ్వ.. పరిచయం అక్కర్లేని పేరు. యాస, మాటతీరు, కామెడీ టైమింగ్ తో యూట్యూబ్ లో స్టార్ గా ఎదిగింది. అంతే కాదు.. ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్లొని ఎనరేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ


గంగవ్వ.. పరిచయం అక్కర్లేని పేరు. యాస, మాటతీరు, కామెడీ టైమింగ్ తో యూట్యూబ్ లో స్టార్ గా ఎదిగింది. అంతే కాదు.. ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్లొని ఎనరేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా తన సొంతూరి ఇబ్బందులు తీర్చింది. తమ గ్రామానికి బస్సు సర్వీసును పునరుద్ధరించేలా చేసి గ్రామస్థుల మన్ననలు అందుకుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామంలో గంగవ్వ నివసిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు రావట్లేదు. దీంతో గ్రామస్థులు, వ్యవసాయ దారులు, కూలీలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్‌ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన ఛార్జీలతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. తమ సమస్యలకు పరిష్కారంగా బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలని ప్రజా ప్రతినిధులను కోరారు.అందుకు బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ సహాయం కోరారు. లంబాడిపల్లికి తిరిగి బస్సు తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామస్థులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను గంగవ్వ బృందం కలిసింది. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును అధికారులు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పులుగా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. లంబాడిపల్లికి తిరిగి బస్సు రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Published on: May 04, 2022 09:35 AM
Loading...
Unable to load recommendations.
Follow Us