ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!
పశ్చిమ బెంగాల్‌లో ఇసుక, క్వారీ మాఫియాపై నిర్వహించిన సోదాల్లో మాజీ బస్సు డ్రైవర్ మీనా మండల్ నివాసం నుంచి రూ.5.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం అయ్యాయి. అక్రమ క్వారీ వ్యాపారం ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తుల మూలాలు, అక్రమ లావాదేవీలపై అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఇసుక, క్వారీ మాఫియాపై పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో అక్రమ సంపాదన వెలుగుచూసింది. బీర్‌భూమ్ జిల్లాకు చెందిన మీనా మండల్ అనే మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ నివాసంలో పక్కా సమాచారంతో సోదాలు జరిపిన పోలీసులు.. ఏకంగా రూ. 5.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, స్థానికంగా ఇసుక, క్వారీ మాఫియా డాన్‌గా చలామణి అవుతున్న తులు మండల్‌కు ఈ మీనా మండల్ సమీప బంధువు. గతంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా పనిచేసిన మీనా, ఆ ఉద్యోగాన్ని వదిలేసి క్వారీ వ్యాపారంలోకి ప్రవేశించాడు. బీర్‌భూమ్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న సుమారు 250 క్వారీలు తులు మండల్ కనుసన్నల్లోనే సాగుతున్నట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ దందా ద్వారానే మీనా పేరుపై పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సోదాలపై నేతలు స్పందిస్తూ, ప్రజల సొమ్మును కొల్లగొట్టే అక్రమార్కులపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఆస్తుల మూలాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
