Roman Saini: 16 ఏళ్లకే డాక్టర్‌ పట్టా..22 ఏళ్లకే కలెక్టర్‌.. 30 ఏళ్లకే రూ.2,600 కోట్ల వ్యాపారం.

|

Jul 15, 2023 | 8:37 PM

కలలు అందరూ కంటారు.. కానీ కొందరే వాటిని నెరవేర్చుకోగలుగుతారు. పట్టుదల, అలుపెరగని కృషి, సంతృప్తి చెందని దీక్షతో కేవలం 22 ఏళ్లకే బడా బిజినెస్‌మ్యాన్‌గా మారాడు ఓ యువకుడు. అవును, అతను డాక్టర్‌ నుంచి, కలెక్టర్‌గా.. కలెక్టర్‌నుంచి బిజినెస్‌మ్యాన్‌గా ఎలా మారాడో తెలుసా..!

ఐఏఎస్‌ చేయాలని ఎంతోమంది అనుకుంటారు. అందుకు ఏళ్లతరబడి కష్టపడతారు, అయితే కొందరు అదృష్టం కలిసిరాకో మరో కారణంగానో ఉత్తీర్ణత సాధించలేరు. అయినా వారి కల నెరవేర్చుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఓ యువకుడు 16 ఏళ్లకే ఎయిమ్స్‌ పరీక్షలో పాసై డాక్టర్‌ పట్టా పొందాడు. అక్కడితో ఆగిపోకుండా తన 22 ఏళ్ల వయసులో యూపీఎస్‌సీ ఎంట్రన్స్‌టెస్ట్‌లో ఉత్తీర్ణుడై నేరుగా ఐఏఎస్‌కు ఎంపికైపోయాడు. కొన్నాళ్లు మధ్యప్రదేశ్‌లో జిల్లాకలెక్టర్‌గా కూడా పనిచేశాడు. అయితే అతనికి అదికూడా సంతృప్తి నివ్వలేదు. ఇంకా ఏదో సాధించాలనుకున్నాడు. అంతే ఉద్యోగం వదిలేశాడు. స్నేహితులతో కలిసి ఒక ఎడ్‌-టెక్‌ ప్లాట్‌ఫాం స్థాపించి, అంచెలంచెలుగా రూ.2,600 కోట్ల విలువైన కంపెనీగా తీర్చిదిద్దాడు. అతనే రోమన్‌ సైనీ. కలెక్టర్‌గా ఉన్న సమయంలోనే తన స్నేహితులు గౌరవ్‌ ముంజాల్‌, హిమేశ్‌ సింగ్‌లతో కలిసి యూట్యూబ్‌లో సివిల్‌ సర్వీసెస్‌కు కోచింగు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అన్‌అకాడమీ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి యువతకు ఉచితంగా పాఠాలు చెప్పారు. దేశవ్యాప్తంగా అపూర్వమైన స్పందన వచ్చింది.. దాంతో ఆ ఛానల్‌ కాస్తా అన్‌అకాడమీ కంపెనీగా మారింది. వివిధ పోటీ పరీక్షల ఆన్‌లైన్‌ శిక్షణలతో ఈ కంపెనీ ఇవాళ 2,600 కోట్ల సంస్థగా ఎదిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...