వివాహ వేడుకకు విశిష్ట అతిథి.. బంధుమిత్రులంతా పరుగో పరుగు
నేపాల్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన వీడియో వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకకు ఆహ్వానం లేని ఓ అతిథి వచ్చింది. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా? ఆ అతిథి సాధారణ అతిథి కాదు, అడవి నుంచి నేరుగా వచ్చిన ‘రైనో జీ’. వీడియో క్లిప్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి దృశ్యం నేపాల్‌లో మాత్రమే చూడగలమని కామెంట్ చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే ఖడ్గమృగం భాయ్ సాబ్ చాలా ప్రశాంతంగా ఓ వివాహ వేడకకు పిలవని పేరంటంలా హాజరైంది. అయితే వివాహ మండపంలో ఎలాంటి విధ్వంసం సృష్టించలేదు. నేరుగా VIP తరహా ఎంట్రీ ఇచ్చి, కొంచెం అటు ఇటుగా తిరిగింది. ఆపై తిరిగి అడవికేసి వెళ్ళిపోయింది. అక్కడున్న వారందరికీ, తాను ఆ జంటను ఆశీర్వదించడానికి వచ్చానని, వారిని ఇబ్బంది పెట్టడానికి కాదని చెబుతున్నట్లుగా ఉంది. ఈ ఘటన నేపాల్‌లోని చిట్వాన్ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో, ఎక్కడ నుంచి వచ్చిందో కానీ, ఓ ఖడ్గమృగం వివాహ వేదిక గేటులోకి ప్రవేశించింది. అదే సమయంలో, ఆ వేడుకకు హాజరైన అతిథులు ఆ అనామక అతిథిని చూసి ఆశ్చర్యపోయారు. వారిలో కొందరు వెంటనే తమ మొబైల్ ఫోన్‌ను తీసి ఖడ్గమృగాన్ని రికార్డ్ చేసారు. మరికొందరు భయంతో పరుగులు తీశారు. కానీ, ఆ ఖడ్గమృగం మాత్రం ప్రశాంతంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి షేర్ చేసిన వీడియోపై కామెంట్ల వరద పారుతోంది. నిజమైన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఇదే, రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసారా, బారాత్ మర్చిపొండి బారా టన్ ఎంట్రీ ఇచ్చింది, పెళ్లి వేడుక అడవికి దగ్గరగా ఉంటే అంతే మరి, కార్డ్ పై అందరూ ఆహ్వనితులే అని రాసుంది దాన్నే సీరియస్‌గా తీసుకుంది, అంటూ జోకులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్పంచ్ కుర్చీని వదలనంటున్న శునకం.. చూసేందుకు క్యూ కడుతున్న జనం
షాపులో వింత శబ్ధాలు.. ఏంటా అని చూసిన ఓనర్‌కి షాకింగ్ సీన్
నేర చరిత్ర ఉన్న రిసార్ట్‌లో బస? హనీమూన్ కోసం వెళ్లి.. అడవుల్లో అదృశ్యం
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

