వామ్మో.. రెండు తలల పాము.. బెంబేలెత్తిన జనం

Updated on: Feb 23, 2026 | 6:27 PM

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఫరూఖ్ నగర్‌లో అరుదైన ఎర్ర ఇసుక బోవా పాము ప్రత్యక్షమై స్థానికులను భయపెట్టింది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు దానిని సురక్షితంగా బంధించి తరలించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి భారీ డిమాండ్ ఉండటంతో అక్రమంగా వేటాడుతుంటారు. అదృష్టం, ఔషధాల కోసం దీనిని ఉపయోగిస్తారనే ప్రచారం ఉంది. అరుదైన జీవుల సంరక్షణకు సహకరించాలని అటవీ శాఖ సూచించింది.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని ఫరూఖ్ నగర్‌లో ఒక అరుదైన అతిథి ప్రత్యక్షమై స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. సాధారణంగా అడవుల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపించే ఎర్ర ఇసుక బోవా పాము, స్థానిక డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో సంచరిస్తూ కనిపించింది. దీనిని చూడగానే స్థానికులు ఒక్కసారిగా హడలెత్తిపోయారు. ఫరూఖ్ నగర్‌కు చెందిన షఫీ అనే వ్యక్తి ఈ పామును గుర్తించి వెంటనే ఫలక్‌నుమా పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అటవీ శాఖ అధికారుల సహకారంతో అత్యంత చాకచక్యంగా ఆ పామును బంధించారు. చూడ్డానికి రెండు తలలు ఉన్నట్లు భ్రమ కలిగించే ఈ పామును సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఎర్ర ఇసుక బోవా పాములకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. వీటిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, కొన్ని రకాల ఔషధాల తయారీలో ఈ పామును ఉపయోగిస్తారనే ప్రచారంతో వీటిని అక్రమంగా వేటాడుతుంటారు. “పనులు చేసుకునే చోట అకస్మాత్తుగా ఈ వింత పాము కనిపించేసరికి ఏం చేయాలో పాలుపోలేదు” అని స్థానికులు పేర్కొన్నారు. అరుదైన ఈ జీవులను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ సూచిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

ఇటు సినిమాలు.. అటు బిజినెస్.. మనోళ్లు అస్సలు తగ్గట్లేదుగా..!

రజినీ, కమల్ మల్టీస్టారర్.. మరి వీరిలో హీరో ఎవరో తెలుసా..?

11 రూపాయలకే సినిమా చూపించిన మేకర్స్..

నిన్న మహేష్.. నేడు ప్రభాస్.. పూరి జగన్నాథ్ పై సంచలన కామెంట్స్

Loading...
Unable to load recommendations.
Follow Us