అరుదైన చేప.. అచ్చం పులిలా కనిపిస్తూ.. వీడియో
సముద్రంలో వింత జీవులు ఎన్నో జీవిస్తుంటాయి. సముద్రం అడుగు బాగాన నివిసించేవి కొన్ని అయితే.. కొన్ని సముద్రం ఉపరితలంపైన సంచరిస్తూ ఉంటాయి. వీటిలో రకరకాల చేపలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడూ అవి మత్స్యకారుల వలకు చిక్కి జనాలను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్ల వలలో పులిమచ్చల చేప పడింది. 10 నుంచి 15 కిలోల బరువుతో వింతగా ఉన్న ఆ చేపను చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో గుమిగూడారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం మినీ ఫిషింగ్ హర్బర్‌లో మత్స్యకారుల వలకు టేకు చేప చిక్కింది. 15 కిలోల బరువున్న పులిమచ్చల టేకు చేపను చూసి ఆశ్చర్యపోయారు స్థానికులు. ఈ చేపను వేలం వేయగా మంచి ధర పలికినట్లు మత్స్యకారులు తెలిపారు. ఈ చేప ఔషధాలకు పెట్టింది పేరని, దీనిని మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. ఈ చేప ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటుందని, ఈ క్రమంలో జాలర్ల వలలో చిక్కుతుందని వివరించారు. దీనిని పోటీపడి మరీ అధిక ధరకు కొనుగోలు చేస్తుంటారు. అందుకే ఈ చేప చిక్కితే మత్స్యకారులకు అదృష్టమే అంటారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సమీపంలో… సముద్రంలో అరుదుగా కనిపించే టేకు చేప.. ప్రపంచ దేశాల్లో రేర్ ఫిష్ గా గుర్తిస్తారు. దీనిని ఆక్వేరియంలో కూడా పెంచుకుంటారు. అందుకే ఈ చేపకు డిమాండ్ ఎక్కువ. ప్రోటీన్ అధికంగా ఉండే పులి మచ్చల టేకు చేప.. కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుందని తక్కువ కొవ్వు ఉండడంతో గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
