రోడ్డుమీద నడుస్తూ..ఒక్కసారిగా కుప్పకూలిన విద్యార్ధిని వీడియో
అప్పటి వరకూ కాలేజ్‌లో చక్కగా పాఠాలు వింది... తోటి విద్యార్ధులతో ఎంతో సరదాగా గడిపింది. కాలేజ్ అయిపోవడంతో ఇంటికి బయలుదేరింది... స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయంది. క్షణాల్లో గుండెపోటుకు బలైపోయింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. చూస్తుండగానే విద్యార్ధిని మృతిచెందిన ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.
జిల్లాలోని అనాసాగరం గ్రామానికి చెందిన మాగం నాగమణి నందిగామలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూలాగే సోమవారం కూడా కాలేజ్‌కు వెళ్లింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో క్లాసులు అయిపోవడంతో తన స్నేహితురాలితో కలిసి సీఎం రోడ్డు మీదుగా నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. ఆ సమయంలోనే ఆమె అకస్మాత్తుగా కింద పడిపోయింది. కంగారు పడిన స్నేహితురాలు చుట్టు పక్కలవారందరినీ కేకలు వేసింది. స్థానికుల సహాయంతో స్నేహితురాలిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అయితే, అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి మరణానికి గుండెపోటు కారణమని తెలిపారు. ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో
నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో
జపాన్‌లో లక్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

