ఫ్రెండ్స్‌తో నైట్ అవుట్‌కు బయలుదేరిన భగీరా.. వీడియో చూస్తే షేకే

Updated on: Jul 25, 2025 | 1:26 PM

సాధారణంగా ఏ రెండు జాతులకు చెందిన జంతువులు కలిసి తిరగడం అనేది చాలా అరుదు. జాతివైరం తప్పక ఉంటుంది. సింహాలు, పులులు లాంటి క్రూరమృగాలంటే అడవికి రాజులే. ఏ జంతువు కూడా వీటి ముందుకు రావడానికి సాహసించవు. ఒకవేళ వాటికంట పడ్డాయో ఆరోజు వాటికి మూడినట్టే. అయితే తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్‌లో ఓ అరుదైన దృశ్యం కనబడింది.

ఓ నల్ల చిరుత, సాధారణ చిరుతలతో కలిసి వెళ్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్‌ అధికారి పర్వీన్‌ కస్వాన్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. జులై 16వ తేదీన అర్థరాత్రి సమయంలో రెండు చిరుత పులులు, బ్లాక్ ప్యాంథర్ కలిసి నీలగిరి అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామంలోకి వచ్చాయి. సిమెంట్ రోడ్డుపై తిరుగుతూ ఉన్నాయి. చిరుత పులులు రోడ్డు చివరన నడుస్తూ ఉంటే.. బ్లాక్ ఫ్యాంథర్ రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంది. ఆ మూడు కలిసి ఆహారం కోసం వెతుకుతున్నట్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు పక్కన అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను ఐఎఫ్ఎస్‌ అధికారి పర్వీన్‌ కస్వాన్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ భగీరా తన ఫ్రెండ్స్‌తో కలిసి నీలగిరి రోడ్లపై నైట్‌ వాక్‌ చేస్తోంది అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు షేర్ చేస్తూ.. నీలగిరిలో నల్లపులి.. భగీరా అద్భుతం, రేర్‌ ఫ్రెండ్‌షిప్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, నల్ల చిరుతగురించి స్పందిస్తూ కాస్వాన్… నల్ల చిరుతపులులు ప్రత్యేకమైన జాతి కాదని, అదికూడా సాధారణ చిరుతపులేనని తెలిపారు. మెలనిస్టిక్ వైవిధ్యం కారణంగా అది నల్లగా కనిపిస్తుందని పేర్కొన్నారు. మెలనిజం అనేది వంశపారంపర్య రుగ్మత, ఇది అధిక ముదురు వర్ణద్రవ్యాన్ని కలిగిస్తుంది. దీని వలన ఈ జంతువు నల్లగా కనిపిస్తుంది. కొన్ని కాంతి పరిస్థితులలో వాటి రంగు మరింత కాంతివంతంగా ప్రకాశిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.4.3 కోట్ల కారు కొని… ఇంట్లో వేలాడదీశాడు

ఈ రాయి విలువ రూ. 44 కోట్లు.. ఏముంది రా అంతగా దీనిలో ..

అందం, ఆరోగ్యం కోసం సూపర్ ఫుడ్స్.. తప్పకుండా తీసుకోండి.. సరదాగా..

జీతమంతా ఈఎంఐలకే పోతోందా? మీ పరిస్థితీ ఇదేనా?

నిద్ర లేవగానే ఇలా చేస్తే.. మీ జీవితం అల్లకల్లోలమే