విశాఖ తీరంలో అరుదైన చేప గుర్తింపు.. దీని ప్రత్యేకత ఏంటంటే ??

|

Sep 16, 2023 | 9:59 AM

విశాఖ బంగళాఖాత తీరంలో అత్యంత అరుదైన చేపను గుర్తించారు. మత్స్యకారుల వలలో రొయ్యలతోపాటు చిక్కిన ఈ అరుదైన చేపను సీ హార్స్‌ చేపగా గుర్తించారు. విజయ్ అనే వ్యక్తి మత్స్యకారుల వద్ద రొయ్యలు కొని తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత రొయ్యలలో డిఫరెంట్‌గా కనిపించిన ఈ చేపను ఫోటో తీసి తన వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టాడు. అది చూసిన ఆంధ్రా యూనివర్సిటీ కి చెందిన ఒక ప్రొఫెసర్ దానిని సీ హార్స్ – సముద్రపు గుర్రంగా గుర్తించి విజయ్ కు ఫోన్ చేసి, అది అతనికి ఎక్కడ ఎలా దొరికిందనే వివరాలు కనుక్కున్నారు.

విశాఖ బంగళాఖాత తీరంలో అత్యంత అరుదైన చేపను గుర్తించారు. మత్స్యకారుల వలలో రొయ్యలతోపాటు చిక్కిన ఈ అరుదైన చేపను సీ హార్స్‌ చేపగా గుర్తించారు. విజయ్ అనే వ్యక్తి మత్స్యకారుల వద్ద రొయ్యలు కొని తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత రొయ్యలలో డిఫరెంట్‌గా కనిపించిన ఈ చేపను ఫోటో తీసి తన వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టాడు. అది చూసిన ఆంధ్రా యూనివర్సిటీ కి చెందిన ఒక ప్రొఫెసర్ దానిని సీ హార్స్ – సముద్రపు గుర్రంగా గుర్తించి విజయ్ కు ఫోన్ చేసి, అది అతనికి ఎక్కడ ఎలా దొరికిందనే వివరాలు కనుక్కున్నారు. ఈ విధంగా విశాఖ తీరం లో సీ హార్స్ ఆనవాళ్లు బయట పడ్డాయి. మత్స్యకారులు గతంలో ఎన్నడూ విశాఖ సముద్ర తీరంలో ఎన్నడూ చూడలేదట. సముద్ర గుర్రం అనేది గుర్రపు తలతో అసాధారణమైన చేప . వీటిలో 20 రకాల జాతులు ఉంటాయి. వెచ్చని మరియు తేలికపాటి సముద్రాలలో ఇవి మనుగడ సాగిస్తూ ఉంటాయి. తూర్పు తీరంలో ఈ అరుదైన సీ హార్స్‌ చేప రకం ఆనవాళ్లు పరిశోధకులకు ఆసక్తిని కలిగించాయి. వీటి గురించి విచారిస్తే ఇటీవల కాలంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు తరచూ ఇవి చిక్కుతున్నాయట. తాజాగా విశాఖ మత్స్యకారుల వలకు ఈ సీ హార్స్ దొరికింది. చూడ్డానికి రొయ్యలాగే కనిపించే ఈ సీహార్స్‌ రెండునుంచి 3 అంగులాల సైజులో ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mamata Banerjee: చీరకట్టు, స్మార్ట్‌ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్‌..

iPhone 15: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి ??

DSP: మ్యూజిక్‌ లవర్స్‌కు దేవి శ్రీ ప్రసాద్ స్సెషల్ గిఫ్ట్

Pallavi Prashanth: సూసైడ్ అటెంప్ట్‌.. ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటూ.. ప్రశాంత్‌ పేరెంట్స్ ఎమోషనల్

Bigg Boss 7 Telugu: బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ దగ్గర్లో రైతు బిడ్డ