Kakinada Kaja Video: కాకినాడ గొట్టం కాజాకు అరుదైన గుర్తింపు.. నేటి తరం గుర్తించేలా.. వీడియో వైరల్
Kakinada Kaja: ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఆదరణ కలిగిన స్వీట్స్ కు అరుదైన గౌరవం దక్కింది. వందేళ్లకు పైగా ఘనమైన చరిత్ర కలిగిన కాకినాడ గొట్టం కాజాతో ఉన్న ప్రత్యేక స్టాంపుని భారతీయ తపాలా శాఖా విడుదల చేసింది. ఒక్కసారి తింటే మరల మరల తినాలనిపించే కాకినాడ గొట్టం కాజాకు అరుదైన గుర్తింపు లభించినట్లు అయింది.
Kakinada Kaja: ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఆదరణ కలిగిన స్వీట్స్ కు అరుదైన గౌరవం దక్కింది. వందేళ్లకు పైగా ఘనమైన చరిత్ర కలిగిన కాకినాడ గొట్టం కాజాతో ఉన్న ప్రత్యేక స్టాంపుని భారతీయ తపాలా శాఖా విడుదల చేసింది. ఒక్కసారి తింటే మరల మరల తినాలనిపించే కాకినాడ గొట్టం కాజాకు అరుదైన గుర్తింపు లభించినట్లు అయింది. దీంతో గోదావరి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాకినాడ కాజాగా ఖ్యాతిగాంచిన ఈ కాజాను కోటయ్య అనే వ్యక్తి మొట్టమొదటి సారిగా 1891 సంవత్సరంలో తయారు చేశారు. ఈ కాజాకు ఉండే ప్రత్యేకమైన రుచి వలన కాకినాడ కోటయ్య కాజాగా కీర్తి పొందారు. కాకినాడకు లేదా చుట్టపక్కల ప్రాంతాలకు వెళ్ళిన విదేశాలలో, ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగువాళ్లు కాకినాడకు వస్తే తప్పకుండా కాజాను కొనుగోలు చేస్తారు.
2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కల్పించింది. ఇపుడు భారత తపాలా శాఖ వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాకినాడ గొట్టం కాజాను నేటి తరం గుర్తించేందుకు ఈ కాజాతో పోస్టల్ల్ కవర్ ద్వారా మరింత వెలుగులోకి తెచ్చింది. ఆంధ్రుల గౌరవం మునుపటితో పోలిస్తే మరింతగా పెరిగిందంటున్నారు ఉభయగోదావరి జిల్లా ప్రజలు.
కాకినాడ గొట్టం కాజాతో పాటు విశాఖ జిల్లాకు చెందిన మాడుగుల హల్వా కు విశిష్ట స్థానం కల్పించింది భారతీయ పోస్టల్ శాఖ. మాడుగుల వేదికగా 1890లో తొలిసారి ఈ హల్వాను తయారు చేశారు. ఈ హల్వాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గోధుమపాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వంటి పదార్ధాలతో రుచికరమైన హల్వాను తయారు చేస్తారు. ఈ హల్వాకు లైంగిక సామర్థ్యం పెంచే గుణం కూడా ఉన్నట్టు అంతర్జాతీయంగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు పోస్టల్ శాఖ మాడుగుల హల్వాతో ఉన్న ఓ పోస్టల్ స్టాంప్ ను రిలీజ్ చేసింది. దీంతో మాడుగుల హాల్వా తయారీదారులతో పాటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.